
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 31వరకు సీఎం జగన్ లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం జరగాల్సిన ఇంటర్ చివరి పరీక్షను(మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2) వాయిదా వేస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే కొత్త పరీక్ష లేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఏపీలో అత్యవసరాల సేవలు మినహా అన్ని సేవలు నిలిపివేయబడ్డాయి.