A Man Brutally Murdered: అనంతపురం శివారులో ఓ వ్యక్తి దారుణ హత్య.. బండరాళ్లతో మోది చంపిన గుర్తు తెలియని దుండగులు

అనంతపురం నగర శివారులో దారుణ హత్య కలకలం రేపింది. జేఎన్‌టీయూ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు.

A Man Brutally Murdered: అనంతపురం శివారులో ఓ వ్యక్తి దారుణ హత్య.. బండరాళ్లతో మోది చంపిన గుర్తు తెలియని దుండగులు
A Man Brutally Murdered In Anantapur
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 26, 2021 | 9:16 AM

A Man Brutally Murdered in Anantapur: అనంతపురం నగర శివారులో దారుణ హత్య కలకలం రేపింది. జేఎన్‌టీయూ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. బేల్దారు యల్లప్పను దుండగులు అతి కిరాతకంగా బండరాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జేఎన్‌టీయూ పాలిటెక్నిక్ కళాశాల వద్ద చోటు చేసుకుంది.

ఈ దారుణానికి సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాత్రి మద్యం మత్తులో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మృతుడు యల్లప్ప భార్య, పిల్లల్ని వదిలేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

Read Also…. Barmer District Collector: పిల్లల క్రియేటివిటీని మెచ్చుకున్న కలెక్టర్.. ఆ ఊరికి వరమిచ్చి వెళ్లారు.. ఇంతకీ వాళ్లు ఏంచేశారంటే..!