Family Suicide: తమిళనాడులో తీవ్ర విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య

కరోనా మహమ్మారి ఓ కుటుంబాన్నే మింగేసింది. వైరస్ సోకి భర్త మరణించడాన్ని జీర్ణించుకోలేని భార్య, తన ఇద్దరు పిల్లలను హతమార్చి తానూ బలవన్మరణానికి పాల్పడింది.

Family Suicide: తమిళనాడులో తీవ్ర విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య
girl gets father killed
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 26, 2021 | 9:40 AM

Woman kills children, self after husband dies: కరోనా మహమ్మారి ఓ కుటుంబాన్నే మింగేసింది. వైరస్ సోకి భర్త మరణించడాన్ని జీర్ణించుకోలేని భార్య, తన ఇద్దరు పిల్లలను హతమార్చి తానూ బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ విషాద ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు.. మాంగాడుకు చెందిన భాస్కర్‌, నిత్య దంపతుల కాపురం ప్రశాంతంగా సాగుతుంది. వీరికి కుమార్తె మహతి (11), కుమారుడు యాదవకృష్ణన్‌ (6) ఉన్నారు. వీరి పచ్చని సంసారంలో కరోనా మహమ్మారి చిచ్చుపెట్టింది. కాగా, గత నెల 2వ తేదీన భాస్కర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో, నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు కుటుంబసభ్యులు. అయితే, చికిత్స పొందుతూ 9వ తేదీన భాస్కర్ మృతిచెందాడు.

దీంతో భర్త మరణంతో శోకసముద్రంలో మునిగిన నిత్య తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకొని ఈరోడ్‌లో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన నిత్య గురువారం మధ్యాహ్న భోజనంలో విషం కలిపి తన పిల్లలకు తినిపించి, తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె తండ్రి పార్థసారధి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also… A Man Brutally Murdered: అనంతపురం శివారులో ఓ వ్యక్తి దారుణ హత్య.. బండరాళ్లతో మోది చంపిన గుర్తు తెలియని దుండగులు

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే