Police Rides : జయ గ్రాండ్ హోటల్‌పై పోలీసులు దాడి.. వ్యభిచారం చేస్తున్నారంటూ ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు అరెస్ట్

గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జయ గ్రాండ్ హోటల్ మీద పోలీసులు ఆకస్మికంగా దాడిచేశారు. వ్యభిచారం చేస్తున్నారంటూ ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు..

Police Rides : జయ గ్రాండ్ హోటల్‌పై పోలీసులు దాడి.. వ్యభిచారం చేస్తున్నారంటూ ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు అరెస్ట్
Prostitution Case
Follow us

|

Updated on: Jun 26, 2021 | 1:44 PM

Guntur Police : గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జయ గ్రాండ్ హోటల్ మీద పోలీసులు ఆకస్మికంగా దాడిచేశారు. వ్యభిచారం చేస్తున్నారంటూ ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. హోటల్ లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించనట్టు తెలుస్తోంది. అయితే, నిందితులు మాత్రం తాము ఏ తప్పూ చేయలేదని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నామని తమను అక్రమంగా అరెస్ట్ చేశారని వాపోతున్నట్టు సమాచారం.

Guntur Arandal Pet Ps

Guntur Arandal Pet Ps

అయితే, హోటల్‌లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో కాల్‌గర్ల్స్‌ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. స్నేహితుని పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ముగ్గురు వ్యక్తులు బెంగళూరు నుంచి అమ్మాయిలను తీసుకొచ్చినట్లు గుర్తించారు. దాడుల్లో ఐదుగురు వ్యక్తులు, ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే, రేవ్‌పార్టీ ఏమైనా నిర్వహించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌ నిర్వాహకులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

లంచం తీసుకుంటూ వీడియో రికార్డింగ్‌లో దొరికిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ :

అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ని ఎట్టకేలకు సస్పెండ్ చేశారు. సదరు ఫీల్డ్ అసిస్టెంట్ ఇటీవల కూలీల నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్కైన సంగతి తెలిసిందే. దీంతో లంచం తీసుకున్నట్టు నిర్దారించుకున్న ఉన్నతాధికారులు ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేశారు.

కాగా, నార్పల మండలం గడ్డంనాగేపల్లి గ్రామంలో ఉపాది హామీ కూలీల దగ్గర డబ్బులు లంచంగా తీసుకుంటుండగా ఒకరు ఈ దృశ్యాల్ని వీడియో రికార్డింగ్ చేశారు. దీంతో ఈ వీడియో అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైరల్ గా అయింది. ఈ ఘటన ఉన్నతాధికారుల ద‌ృష్టికి వెళ్లడంతో ఉదంతంపై విచారణ చేపట్టిన డిఆర్డిఏ పిడి వేణుగోపాల్ రెడ్డి.. సదరు ఫీల్డ్ అసిస్టెంట్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read also : Vijayashanthi : దళిత మహిళ లాకప్ డెత్ తో పోలీస్ స్టేషన్లు ఎలా పనిచేస్తున్నాయో అర్థమవుతోంది : విజయశాంతి