మీ ఇంట్లో కూడా అక్కాచెల్లెల్లు ఉన్నారు కదరా..

దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు రేపిందే తెలిసిందే. ఈ ఇష్యూపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అత్యంత పాశవికంగా అమ్మాయిని రేప్ చేసి చంపేసిన నిందితులు ఉరి తీయాలంటూ అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు ఖండించారు. అయితే కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంపై గమ్మనుండటంతో వారిని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. అందులో స్టార్ యాంకర్, నటి అనసూయ కూడా ఉన్నారు. విమర్శల ఉదృతి పెరగడంతో  అనసూయ రిప్లై […]

మీ ఇంట్లో కూడా అక్కాచెల్లెల్లు ఉన్నారు కదరా..
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 05, 2019 | 9:39 PM

దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు రేపిందే తెలిసిందే. ఈ ఇష్యూపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అత్యంత పాశవికంగా అమ్మాయిని రేప్ చేసి చంపేసిన నిందితులు ఉరి తీయాలంటూ అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు ఖండించారు. అయితే కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంపై గమ్మనుండటంతో వారిని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. అందులో స్టార్ యాంకర్, నటి అనసూయ కూడా ఉన్నారు.

విమర్శల ఉదృతి పెరగడంతో  అనసూయ రిప్లై ఇచ్చారు. దిశ ఘటన నిందితులను సపోర్ట్ చేసిన వారిపై అనసూయ మండిపడింది. ఈ క్రమంలో తనపై కామెంట్ చేసిన వారిని ఏకిపారేసింది.  ముందు పిల్లల్ని పెంచడం నేర్పిచండి. మీ ఇంట్లో ఆడపిల్లలాగే, అందరూ కూడా అని వారికి చెప్పండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయని పేర్కుంది. దిశ ఘటన తనను చాలా కలచివేసిందన్న అనసూయ..కేవలం ఒక ట్వీట్ పెట్టి చేతులు తులుపుకోవాలనుకోలేదని చెప్పింది. ఈ క్రమంలో సంయమనం కోల్పోయిన స్టార్ యాంకర్ కొన్ని అసభ్య పదాలను కూడా ఉపయోగించింది. కొంతమంది మృగాళ్ల వల్ల అందరికి చెడ్డపేరు వస్తుందని, ఎవర్ని నమ్మాలో తెలియడం లేదని అనసూయ ఎమోషనల్ ఫీల్ అయ్యింది.