AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కథ ఆధారంగానే సినిమా తీశారు.. ఆ మూవీ విడుదల ఆపండి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అమృత..

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. అటు షూటింగ్‏లు కూడా ఆగిపోయాయి. ఇటీవల కొన్ని సినిమాల షూటింగ్‏లు తిరిగి ప్రారంభమయ్యాయి.

నా కథ ఆధారంగానే సినిమా తీశారు.. ఆ మూవీ విడుదల ఆపండి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అమృత..
Rajitha Chanti
|

Updated on: Dec 23, 2020 | 7:50 PM

Share

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. అటు షూటింగ్‏లు కూడా ఆగిపోయాయి. ఇటీవల కొన్ని సినిమాల షూటింగ్‏లు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం లాక్‏డౌన్ సమయంలోనూ వరుస సినిమాలను రీలిజ్ చేస్తూ తెగ బిజీగా ఉండిపోయాడు. అంతే కాకుండా సొంతంగా ఆన్‏లైన్ థియేటర్ ఓపెన్ చేసి మరీ తన సినిమాలను విడుదల చేస్తున్నాడు. కాగా ఇటీవల రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన మర్డర్ సినిమా హాట్ టాపిక్‏గా మారిన విషయం తెలిసిందే.

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యకు సంబంధించినట్టుగా ఈ సినిమాను తీసినట్లుగా ట్రైలర్‏లో తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తిగా తన కథ ఆధారంగానే చిత్రీకరించారని.. తమ కుటుంబ మనోభావాలను దెబ్బతీసేలా ఈ చిత్రం ఉందని.. వెంటనే ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని ప్రణయ్ భార్య అమృత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కథ ఆధారంగానే వర్మ ఈ సినిమా తీశారని అమృత పిటిషన్‏లో పేర్కోంది. అంతేకాకుండా వర్మ తెలివితేటలు ఉపయోగించి తన కథనే సినిమాగా తీసి కోర్టును తప్పుదోవపట్టించారని, లాంచ్ పిటిషన్‏ను విచారించాలని అమృత హైకోర్టును కోరింది. కాగా అటు లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ విచారణకు నిరాకరించడంతో చిత్ర యూనిట్ రేపు ‘మర్డర్’ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే