ఆర్టికల్ 370 రద్దు చేస్తాం.. అమిత్ షా సంచలన ప్రకటన
భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీయాలనుకునే పాకిస్థాన్‌కు సరైన బుద్ధి చెబుతామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. దేశాన్ని టెర్రరిస్టుల నుంచి కాపాడే క్రమంలో రాజీపడబోమన్నారు. జార్ఖండ్‌లోని పలామ్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. బీజేపీ తిరిగి అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370ని రద్దు చేసి.. జమ్మూకాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ కల్పిస్తామని ప్రకటించారు. ఇకపోతే దేశభద్రత గురించి ప్రధానంగా ప్రస్తావించిన అమిత్ షా.. పాకిస్థాన్ ఆటలు ఇక సాగనివ్వమని.. బుల్లెట్ కు […]
భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీయాలనుకునే పాకిస్థాన్‌కు సరైన బుద్ధి చెబుతామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. దేశాన్ని టెర్రరిస్టుల నుంచి కాపాడే క్రమంలో రాజీపడబోమన్నారు. జార్ఖండ్‌లోని పలామ్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. బీజేపీ తిరిగి అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370ని రద్దు చేసి.. జమ్మూకాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ కల్పిస్తామని ప్రకటించారు. ఇకపోతే దేశభద్రత గురించి ప్రధానంగా ప్రస్తావించిన అమిత్ షా.. పాకిస్థాన్ ఆటలు ఇక సాగనివ్వమని.. బుల్లెట్ కు బుల్లెట్ తోనే సమాధానం చెబుతామన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఉండడం వల్ల దేశ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌కు దేశమంతా హర్షం వ్యక్తం చేస్తే.. కొందరు నేతలు ఆధారాలు చూపించమని అడగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.