డ్రాగన్ సామ్రాజ్య కాంక్షకు టిబెటన్లు బలి.. టిబెట్ స్వేచ్ఛావాణికి భారతీయుల మద్దతు.. సీ పోల్ సర్వేలో నిజనిజాలు..!
తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రిబెట్‌కు స్వేచ్ఛ వాయువును ప్రసవించడానికి భారతీయులు అండగా నిలుస్తున్నారు.
Indians support free Tibet : సరిహద్దులో చైనా వల్ల ఎప్పుడూ చికాకులే ఎదురవుతున్నాయి. 1962 నుంచి ఇటీవలి గల్వాన్ ఘర్షణల వరకు నిత్యం గిల్లికజ్జాలకు దిగుతోంది డ్రాగన్ కంట్రీ. 1950లో సామ్యవాద మసుగులో టిబెట్‌ను ఆక్రమించినా చైనాను భారత్ వెనుకేసుకొచ్చిందన్న వాదనలు కూడా ఉన్నాయి. అటు రెండు దేశాల నడుమ ఉన్న టిబెట్ పంజరంలో ఉన్న చిలుకలా నలిగిపోతోంది.
అయితే, తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రిబెట్‌కు స్వేచ్ఛ వాయువును ప్రసవించడానికి భారతీయులు అండగా నిలుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి IANS సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 80 శాతం మంది భారతీయులు.. టిబెట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది టిబెట్ పోల్ ప్రకారం ఇది సంకేతంగా నిలుస్తోంది. ఇందుకోసం కేవలం 10 బేసి ప్రశ్నలను మాత్రమే తీసుకుని సర్వే నిర్వహించినట్లు IANS సీ ఓటర్ పేర్కొంది. వారి నైతిక దిక్సూచిని పున:పరిశీలించడానికి ప్రతివాదుల నుండి 5 నిమిషాలపాటు చర్చించినట్లు నివేదికలో వెల్లడించింది. భారతీయులు ఎక్కువమంది టిబెట్ స్వతంత్రానికి మద్దతు ఇస్తున్నారు.
టిబెట్ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. టిబెట్‌ను చైనా కబ్జా చేయడానికి ముందు భారత్-చైనాల మధ్య ఉమ్మడి సరిహద్దు అనేదే లేదు. భారత్ – చైనా సరిహద్దులో ఉండే టిబెట్ బార్డర్‌లో కేవలం 60 మంది భారతీయ పోలీసులు పహరా ఉండేవారు. టిబెట్ స్వతంత్ర దేశమైతే అది ప్రపంచంలో పదో పెద్ద దేశంగా నిలిచేది. సముద్ర మట్టానికి 4,000 మీటర్ల ఎత్తులో, 25 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన టిబెట్‌ను ప్రపంచ పైకప్పుగా వర్ణిస్తారు. లడ్డాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలకు మూడేళ్ల ముందు డోక్లాంలో కూడా రెండు దేశాల సైనికులు తలపడ్డారు. భారత్ – చైనాల మధ్య సరిహద్దు వివాదం పరిధి లద్దాఖ్, డోక్లాం, నాథులా మీదుగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లోయ వరకూ విస్తరించింది. తవాంగ్‌ను టిబెట్‌లో భాగమని.. తవాంగ్, టిబెట్ సంస్కృతి, సంప్రదాయాలు చాలా వరకూ ఒకేలా ఉంటాయని చెబుతోంది. అయితే, 1938లో ఏర్పాటు చేసిన మెక్‌మోహన్ లైన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగం. చైనా టిబెట్‌ను 1951లోనే తన నియంత్రణలోకి తెచ్చుకుంది.
మావో జెడాంగ్ నాయకత్వంలో ఆవిర్భవించిన కమ్యూనిస్టు చైనాతో భారత్ చెలిమి చేసింది. టిబెట్‌తో వందల సంవత్సరాలుగా పటిష్ఠ సాంస్కృతిక సంబంధాలు ఉన్నప్పటికీ, వాటిని విస్మరించి హిందీ-చీనీ భాయిభాయి అంటూ జతకట్టాయి. దీంతో హిమాలయాల్లో 4,085 కిలోమీటర్ల పొడవునా చైనా సైన్యం తిష్ఠవేసి, భారత్‌కు పక్కలో బల్లెంలా తయారైంది.
తవాంగ్ బౌద్ధుల ప్రముఖ ఆరామం. దలైలామా తవాంగ్ ఆరామాన్ని సందర్శించిన సమయంలో కూడా చైనా ఆ పర్యటనను చాలా వ్యతిరేకించింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లినపుడు కూడా చైనా ఆ పర్యటనపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. టిబెట్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తమదేనని చైనా చెబుతోంది. దానిని దక్షిణ టిబెట్ అంటోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు చైనాతో 3,488 కిలోమీటర్ల పొడవు సరిహద్దు ఉంది.
కాగా, ఇంతకాలం చైనా నియంత్రణలో ఉన్న టిబెటన్లు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. డ్రాగన్ కంట్రీ నుంచి విముక్తి కల్పించాలని పోరాడుతున్నారు. కాగా, ఇటీవల విధానాల కారణంగా ఎక్సైల్ లోని టిబెటన్ ప్రభుత్వం చైనాను వ్యతిరేకిస్తూ వస్తుంది. 2016 నుండి భారత ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది. దీనికి అందరి నుండి మరింత మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందు కోసం దాదాపు 75 శాతం మంది భారతీయులు దాని గురించి పూర్తిగా క్లూలెస్‌గా ఉన్నారనే వాస్తవం మనకు తెలియజేస్తుంది. చైనా వ్యతిరేక భావోద్వేగాలు భారతదేశంలో అధికంగా నడుస్తున్నాయి.
అయితే, ఒక్కసారి టిబెట్ చరిత్రను పరిశీలిస్తే…
చైనా, టిబెట్ మధ్య గొడవ.. టిబెట్ చట్టబద్ధ హోదాకు సంబంధించినది. టిటెబ్ 13వ శతాబ్దం మధ్య కాలం నుంచీ తమ దేశంలో భాగంగా ఉందని చైనా చెబుతుంది. కానీ టిబెటన్లు మాత్రం తమ దేశం ఎన్నో శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉందని, తమపై చైనా అధికారం నిరంతరంగా లేదని చెబుతున్నారు.
మంగోల్ రాజు కుబ్లాయ్ ఖాన్ యువాన్ రాజవంశాన్ని స్థాపించి.. తన రాజ్యాన్ని టిబెట్‌తో పాటు, చైనా, వియత్నాం, కొరియా వరకూ విస్తరించాడు.తర్వాత 17వ శతాబ్దంలో చైనా చింగ్ రాజవంశానికి టిబెట్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. 260 ఏళ్ల బంధం తర్వాత చింగ్ సైన్యం టిబెట్‌ను ఆక్రమించింది. కానీ మూడేళ్లలోనే టిబెటన్లు వారిని తరిమికొట్టి.. 1912లో 13వ దలైలామా టిబెట్ స్వతంత్ర దేశమని ప్రకటించారు.
1951లో చైనా సైన్యం మరోసారి టిబెట్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుంది. టిబెట్ ప్రతినిధి బృందంతో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టిబెట్ సౌర్వభౌమాధికారాన్ని చైనాకు అప్పగించారు. దీంతో దలైలామా భారత్ వచ్చి తలదాచుకుంది. అప్పటి నుంచి ఆయన టిబెట్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతూనే ఉన్నారు.
జే సింఖాపా 1409లో జేలగ్ స్కూల్ స్థాపించారు. ఆ స్కూలు ద్వారా బౌద్ధ మత ప్రచారం జరిగేది. ఆ ప్రాంతం భారత్, చైనా మధ్య ఉండేది. దానిని టిబెట్ అని పిలిచేవారు. అదే స్కూల్లో విద్యార్థి గెందూన్ ద్రుప్ గురించి చాలా చర్చ జరిగేది. తర్వాత ఆ గెందునే మొదటి దలైలామా అయ్యారు. బౌద్ధ మతాన్ని అనుసరించేవారు దలైలామాను బుద్ధుడి రూపంగా చూసేవారు. ఆయనను కరుణకు ప్రతీకగా భావించేవారు. మద్దతుదారులు ఆయన్ను తమ నేతగా కూడా భావించేవారు.
ముఖ్యంగా దలైలామాను ఒక బోధకుడుగా చూసేవారు. లామా అంటే గురువు అని అర్థం. లామా తన వారు సరైన మార్గంలో వెళ్లేలా స్ఫూర్తి నింపేవారు. టిబెట్‌లో బౌద్ధ మతానికి నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్దులందరికీ మార్గదర్శకుడుగా నిలిచేవారు.
1630వ దశకంలో టిబెట్ ఏకీకరణ సమయం నుంచి బౌద్ధులు, టిబెట్ నాయకత్వం మధ్య గొడవ మొదలైంది. మాంచూ, మంగోల్, ఓయిరాత్ గుంపుల మధ్య టిబెట్‌లో అధికార కోసం యుద్ధాలు జరిగేవి. చివరికి ఐదో దలైలామా టిబెట్‌ను ఏకం చేయడంలో విజయవంతం అయ్యారు. ఆ తర్వాత నుంచీ టిబెట్ సాంస్కృతిక గుర్తింపు సాధించింది. టిబెట్ ఏకీకరణతో అక్కడ బౌద్ధ మతం వృద్ధి చెందింది.
జెలగ్ బౌద్ధులు 14వ దలైలామాకు కూడా గుర్తింపు ఇచ్చారు. దలైలామాను ఎంచుకునే ప్రక్రియ గురించి కూడా వివాదం ఉంది. 13వ దలైలామా 1912లో టిబెట్‌ను స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత చైనా టిబెట్‌పై దాడి చేసింది. అక్కడ 14వ దలైలామా ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఈ దాడి జరిగింది. ఆ యుద్ధంలో టిబెట్ ఓడిపోయింది. కొన్నేళ్ల తర్వాత టిబెట్ ప్రజలు చైనా పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తమ సౌర్వభౌమాధికారాన్ని డిమాండ్ చేశారు.
కానీ తిరుగుబాటుదారులకు విజయం దక్కలేదు. దాంతో, తాము చైనా గుప్పిట్లో ఘోరంగా చిక్కుకుపోయామని దలైలామాకు అనిపించింది. అప్పుడు ఆయన భారత్ శరణు వేడారు. 1959లో దలైలామాతోపాటు టిబెటన్లు భారీ సంఖ్యలో భారత్ వచ్చారు. ఆయనకు భారత్ ఆశ్రయం ఇవ్వడం చైనాకు నచ్చలేదు. దలైలామాకు ప్రపంచవ్యాప్తంగా సానుభూతి లభించింది. కానీ ఇప్పటికీ ఆయన ప్రవాస జీవితాన్నేగడుపుతున్నారు.
Read Also… చైనా, తైవాన్ మధ్య ముదురుతున్న వివాదం.. దక్షిణ చైనా సముద్రం వేదిక రెండు దేశాల యుద్ధ విన్యాసాలు