AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

పరిపాలన వైఫల్యంతో అప్రతిష్ట మూటగట్టుకున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని విడిచిపెట్టాడు అంబటి రాయుడు.

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే
Ram Naramaneni
|

Updated on: Dec 17, 2020 | 7:02 AM

Share

Ambati Rayudu : పరిపాలన వైఫల్యంతో అప్రతిష్ట మూటగట్టుకున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని విడిచిపెట్టాడు అంబటి రాయుడు. కొత్త సీజన్‌‌లో రాయుడు ఆంధ్ర జట్టు‌కు ఆడతాడని, ఈ మేరకు అతనికి ఎన్ఓసీ ఇచ్చినట్టు హెచ్‌సీఏ సెక్రటరీ విజయానంద్‌‌ ధ్రువీకరించారు. దీంతో జనవరి 10 నుంచి జరిగే సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టోర్నమెంట్‌‌లో ఆంధ్ర టీమ్‌‌ సెలెక్షన్‌‌కు అంబటి అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో ఆంధ్ర క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ నుంచి కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 35 ఏళ్ల రాయుడు హెచ్‌‌సీఏను వీడి ఆంధ్రకు ఆడడం ఇది రెండోసారి. 2005-06 సీజన్‌‌లో అతను ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత బరోడా, విదర్భ జట్లకు ఆడిన రాయుడు.. 2017-18 సీజన్‌‌లో తిరిగి హైదరాబాద్‌‌ జట్టు‌లో చేరాడు.

రిటైర్మెంట్‌‌ను పక్కనబెట్టి మరీ రాయుడు గత సీజన్‌‌లో విజయ్‌‌ హజారే, ముస్తాక్‌‌ అలీ టీ20 టోర్నీల్లో హైదరాబాద్‌‌కు కెప్టెన్‌‌గా వ్యవహరించాడు. ఆ రెండు టోర్నీల్లో జట్టు మంచిగానే రాణించింది. అనంతరం హెచ్‌‌సీఏలో అవినీతితో టీమ్‌‌లో చాలా పాలిటిక్స్‌‌ జరుగుతున్నాయని, డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లనే సెలెక్ట్‌‌ చేస్తున్నారన్న విషయాలను బయటపెట్టాడు రాయుడు. అర్జున్‌‌ యాదవ్‌‌కు సీనియర్‌‌ టీమ్‌‌ కోచ్‌‌గా కొనసాగే అర్హతే లేదన్నాడు. పరిస్థితి ఇలానే ఉంటే టీమ్‌‌కు, ప్లేయర్లకే చాలా నష్టం అన్నాడు. ఈ విషయాలను అజార్‌‌కు చెప్పినా పట్టించుకోకపోవడంతో రాయుడు రంజీలకు దూరంగా ఉన్నాడు. అంబటి ఊహించినట్టే ఆ ట్రోఫీలో హైదరాబాద్‌‌ దారుణంగా ఆడింది. అయితే, రాయుడు బయటపెట్టిన సమస్యలు పరిష్కరించని అజార్‌‌ తిరిగి అతనిపైనే ఎదురుదాడి చేశాడు. అప్పటి నుంచి అజర్‌‌, రాయుడికి అస్సలు పడడం లేదని హెచ్‌‌సీఏ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : జియో స్పీడ్… 4జీ డౌన్‌లోడ్‌ వేగంలో టాప్‌… టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..