
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కట్టడిలోకి రావడం లేదు. తాజాగా దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా జైల్లో మొత్తం 190 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 86 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని జైలు సూపరింటెండెంట్ సైరోజ్ అహ్మద్ భట్ తెలిపారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. జైలు మొత్తాన్ని అధికారులు శానిటైజ్ చేశారు. ఇతర ఖైదీలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జైలు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.