హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్న అల్లుఅర్జున్ పుష్ప… శరవేగంగా షూటింగ్ చేస్తున్న సుకుమార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నడని సమాచారం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నడని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా..దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలో ఉన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప’ షూటింగ్ జరుపుతున్నారు. సినిమాకు కీలకమైన సన్నివేశాలను అల్లు అర్జున్‌పై ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.మారేడిమిల్లిలో మిగిలిపోయిన ప్యాచ్ వర్క్స్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
రామోజీ ఫిలిం సిటీ వెనకాల ఉన్న ప్రాంతంలో ‘పుష్ప’ షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. బన్నీతో సహా మిగిలిన స్టార్ కాస్ట్ అంతా ఈ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. జనవరిలో తమిళనాడులోని టెన్ కాశీలో ఈ సినిమా షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో శరవేగంగా షూటింగ్ పూర్తిచేయాలని బన్నీ సుకుమార్ భావిస్తున్నారు.