డిసెంబరు 1 తర్వాత దేశవ్యాప్తంగా ఆగిపోనున్న రైళ్ల సర్వీసులు.. వాట్సాప్ పోస్ట్ వైరల్!
కరోనా రెండో విడత విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తున్న ప్రచారంపై భారత రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా వస్తున్న..
కరోనా రెండో విడత విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తున్న ప్రచారంపై భారత రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. డిసెంబరు 1 తర్వాత దేశవ్యాప్తంగా కొవిడ్ ప్రత్యేక రైళ్లు సహా రైళ్లన్నీ నిలిచిపోనున్నాయంటూ సోషల్ మీడియా వేదికల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. తప్పుడు వార్తలపై రంగంలోకి దిగిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రకటన ఏదీ రాలేదని తేల్చి చెప్పింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. వైరల్ అవుతున్న వార్తలతో సంబంధంలేదని రైల్వే శాఖ చెప్పింది. ఆ మెసేజ్‌లో ఎంతమాత్రమూ నిజం లేదని, రైళ్ల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
డిసెంబరు 1 తర్వాత కొవిడ్ 19 స్పెషల్ రైళ్లు సహా అన్ని రైళ్లు నిలిచిపోనున్నాయంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న పోస్టును ట్వీట్ చేసిన పీఐబీ.. ఇలాంటి అనుమానాస్పద మెసేజ్ కనుక వస్తే వెంటనే నమ్మేయకుండా నిజనిర్ధారణ చేసుకోవాలని సూచించింది. తప్పుడు వార్తలపై ప్రభుత్వ సైట్ల ద్వారా నిర్ధారించుకోవాలని రైల్వే స్పష్టం చేసింది.
It is claimed in a #WhatsApp forward that all trains including the #COVID19 special trains will stop operating after 1st December. #PIBFactCheck: This claim is #Fake. @RailMinIndia has taken no such decision on halting of train services after 1st December. pic.twitter.com/3ZeGyCEaOw
— PIB Fact Check (@PIBFactCheck) November 23, 2020