‘పటాస్’లోకి రాములమ్మ రీ-ఎంట్రీ..?

|

Dec 08, 2019 | 10:29 AM

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోలలో ‘పటాస్’ ఒకటి. ఈ షోకి విపరీతమైన క్రేజ్ రావడానికి యాంకర్ రవి, శ్రీముఖిల కాంబినేషన్ ముఖ్య కారణం. అయితే సడన్‌గా శ్రీముఖి షో నుంచి తప్పుకుంది. యాంకర్ రవితో గొడవలు ఉండటం వల్లే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత నిర్వాహకులు శ్రీముఖి స్థానంలో వర్షిణిని తీసుకొచ్చి షో నడిపిస్తున్నా… టీఆర్పీ రేటింగ్స్ మాత్రం సోసోగానే ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం యాంకర్ రవి కూడా […]

పటాస్లోకి రాములమ్మ రీ-ఎంట్రీ..?
Follow us on

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోలలో ‘పటాస్’ ఒకటి. ఈ షోకి విపరీతమైన క్రేజ్ రావడానికి యాంకర్ రవి, శ్రీముఖిల కాంబినేషన్ ముఖ్య కారణం. అయితే సడన్‌గా శ్రీముఖి షో నుంచి తప్పుకుంది. యాంకర్ రవితో గొడవలు ఉండటం వల్లే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత నిర్వాహకులు శ్రీముఖి స్థానంలో వర్షిణిని తీసుకొచ్చి షో నడిపిస్తున్నా… టీఆర్పీ రేటింగ్స్ మాత్రం సోసోగానే ఉన్నాయి.

ఇకపోతే ప్రస్తుతం యాంకర్ రవి కూడా ‘పటాస్’ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో చలాకీ చంటి హోస్టుగా రానున్నాడు. ఈ నేపథ్యంలో మల్లెమాల టీమ్ మరోసారి యాంకర్ శ్రీముఖిని ‘పటాస్’కు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ తర్వాత శ్రీముఖికి క్రేజ్ మరింత పెరిగిన సంగతి తెలిసిందే. కాబట్టి శ్రీముఖి మళ్ళీ షోలోకి రీ-ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్స్ అద్భుతంగా ఉంటాయని నిర్వాహకులు భావన.