TCongress: అన్నిదారులు తుక్కుగూడవైపే.. అందరి కళ్లు కాంగ్రెస్ హామీలపైనే!

|

Apr 05, 2024 | 9:06 PM

తుక్కుగూడను సెంటిమెంట్‌గా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. దానిలో భాగంగానే.. అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది తెలంగాణ కాంగ్రెస్‌. అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి విజయం సాధించడంతో

TCongress: అన్నిదారులు తుక్కుగూడవైపే.. అందరి కళ్లు కాంగ్రెస్ హామీలపైనే!
Congress
Follow us on

తుక్కుగూడను సెంటిమెంట్‌గా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. దానిలో భాగంగానే.. అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది తెలంగాణ కాంగ్రెస్‌. అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి విజయం సాధించడంతో.. రేపటి జనజాతర సభతోనూ క్యాంపెయిన్‌ స్టార్ట్‌ చేసి.. పార్లమెంట్‌ ఎన్నికల్లో హిస్టరీ రిపీట్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. దాంతోపాటు.. AICC చీఫ్‌ ఖర్గేతో పాటు.. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ హాజరుకానుండడంతో కాంగ్రెస్‌ నేతలు తుక్కుగూడ సభపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. దానికి తగ్గట్లే.. 10లక్షల మందిని తరలించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచించింది టీకాంగ్రెస్‌.

తెలంగాణ వ్యాప్తంగా అన్నిగ్రామాలు, ప‌ట్టణాలు, న‌గ‌రాల నుంచి ప్రజ‌లను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌ దీపాదాస్​ మున్షీ, పలువురు మంత్రులు.. స‌భ ప్రాంగ‌ణాన్ని సంద‌ర్శించి ఏర్పాట్లను ప‌రిశీలించారు. ఇక.. తుక్కుగూడ సభా వేదిక నుంచి ఏఐసీసీ మ్యానిఫెస్టోను రాహుల్‌గాంధీ రిలీజ్ చేస్తారన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. అందరికి న్యాయం జరగాలి అనేది నినాదంతో మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. మరోవైపు.. తుక్కుగూడ సభకు బూత్‌ స్థాయి నుంచి కార్యకర్తలు, నేతలు హాజరవుతారన్నారు.

70 ఎకరాల్లో సభ, 550 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు శ్రీధర్‌బాబు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు ఖాయమన్నారు దీపాదాస్‌ మున్షీ. సేవ్ ఇండియా, సేవ్ డెమొక్రసీ కోసమే కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని చెప్పారు. ప్రజల కోసమే రాహుల్‌గాంధీ.. భారత్‌ జోడో, భారత్‌ న్యాయ్‌ యాత్రలు చేస్తున్నారని తెలిపారు దీపాదాస్‌ మున్షీ. మొత్తంగా.. పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి తుక్కుగూడ సభలో కాంగ్రెస్‌ ఎలాంటి హామీలు ఇస్తుందో చూడాలి.