జోసెలిన్‌ జేమ్స్‌ ఔదర్యానికి చలించిన టెర్రెల్‌

ఉపకారికి ఉపకారం చేయడంలో గొప్పేముంటుంది..? అపకారికి నుపకారము నెపమెన్నక సేయువారే గొప్ప...! ఆ లెక్కన జోసెలిన్‌ జేమ్స్‌ గొప్పలో గొప్ప! ఆమె ఎవరు? ఏం చేసింది? అన్నది తెలుసుకోవాలంటే...

జోసెలిన్‌ జేమ్స్‌ ఔదర్యానికి చలించిన టెర్రెల్‌
Follow us
Anil kumar poka

|

Updated on: Sep 12, 2020 | 6:22 PM

ఉపకారికి ఉపకారం చేయడంలో గొప్పేముంటుంది..? అపకారికి నుపకారము నెపమెన్నక సేయువారే గొప్ప…! ఆ లెక్కన జోసెలిన్‌ జేమ్స్‌ గొప్పలో గొప్ప! ఆమె ఎవరు? ఏం చేసింది? అన్నది తెలుసుకోవాలంటే అమెరికాలోని అలబామాకు వెళ్లాలి.. కొన్నాళ్ల కిందట ఆమె డ్రగ్స్‌కు బానిసయ్యింది.. తిండితిప్పలు మానేసి డ్రగ్స్‌నే తీసుకునేది… ఆ భూతానికి చిక్కితే బయటపడటం కష్టం.. మాదకద్రవ్యాలకు బానిసగా మారిన జేమ్స్‌ ఉద్యోగాన్ని వదిలేసింది.. ఇళ్లు గుల్ల చేసుకుంది.. చివరాఖరికి దొంగగా మారింది.. అలబామాలో ఆమె మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా మారింది.. 2007-2012 మధ్య కాలంలో 16 సార్లు అరెస్టయ్యింది… ఈ పదహారుసార్లు ఆమెను అరెస్ట్‌ చేసింది టెర్రెల్‌ పాటర్‌ అనే పోలీసు.. పాపం ఆ పెద్దాయన కూడా తనకున్న పెద్దరికంతో ఆమెకు నాలుగు మంచి మాటలు చెప్పాడు.. పాడు జీవితాన్ని వదిలేయమని అన్నాడు.. అప్పుడాయన మాటలను చెవికెక్కించుకోలేదు కానీ.. ఓ శుభదినాన తను చేస్తున్న తప్పేమిటో ఆమెకు తెలిసివచ్చింది.. వెంటనే అధికారుల దగ్గరకు వెళ్లి లొంగిపోయింది.. ఆరు నెలలు జైల్లో గడిపింది.. అక్కడి నుంచి డ్రగ్‌ అడిక్షన్‌ సెంటర్‌కు వెళ్లింది.. అక్కడే పూర్తిగా మారిపోయింది.. తనలా డ్రగ్స్‌కు బానిసలైనవారిని రక్షించే పనిని భుజాన వేసుకుంది..

ఓరోజు జోసెలిన్‌ జేమ్స్‌ యథాలాపంగా తన ఫేస్‌బుక్‌ను ఓపెన్‌ చేసింది.. అందులో టెర్రెల్‌ పాటర్‌ మూత్రపిండాలు దెబ్బతిన్నాయని.. కిడ్నీ దాత కోసం ఆయన బంధువులు ఎదురుచూస్తున్నారని తెలుసుకుంది. వెంటనే టెర్రెల్‌ కూతురును కలిసింది.. కిడ్నీని తానిస్తానని చెప్పింది.. డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. టెర్రెల్‌కు జేమ్స్‌ కిడ్నీని అమర్చారు.. ఇప్పుడు ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. జేమ్స్‌ ఔదర్యానికి టెర్రెల్‌ చలించిపోయాడు.. తాను ఆమెను 16 సార్లు జైలుకు పంపానని, అయినా ఆమె మంచి మనసుతో తనకు కిడ్నీ దానం చేసిందని కృతజ్ఞతా భావంతో చెప్పారు. ఆ భగవంతుడు తమను ఇలా కలుపుతాడని ఊహించలేదని ఉగ్వేదంతో చెప్పుకొచ్చాడు..