ఫ్లాష్ : అక్కినేని ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్

టాలీవుడ్ లో ఎన్నో అంచనాలతో తెరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేనికి ఇప్పటివరకూ లక్కు కుదరలేదు. బ్లాక్ బస్టర్ హిట్ చేతికందలేదు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ వచ్చింది...

  • Pardhasaradhi Peri
  • Publish Date - 2:15 pm, Mon, 7 September 20
ఫ్లాష్ : అక్కినేని ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్

టాలీవుడ్ లో ఎన్నో అంచనాలతో తెరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేనికి ఇప్పటివరకూ లక్కు కుదరలేదు. బ్లాక్ బస్టర్ హిట్ చేతికందలేదు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అఖిల్ తన 5వ సినిమా సూపర్ హిట్స్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నాడు. దీనికి సంబంధించి బిగ్ అనౌన్స్ మెంట్ 9వ తేదీ ఉదయం 9.09 గంటలకి చేయబోతున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కబోతోన్న ఈ సినిమాకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నారు. పూర్తి స్థాయి మాస్ మూవీగా ఈ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం అఖిల్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తున్నాడు. అటు, తాజాగా సురేందర్ రెడ్డి – పవన్ కాంబో.. పవర్ స్టార్ బర్త్ డే రోజు అనౌన్స్ అయిన సంగతి తెలసిందే. అయితే, పవన్ సినిమా కంటే ముందే అఖిల్ మూవీ చేస్తాడు సురేందర్ రెడ్డి. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినా.. క్రిష్ సినిమా, ఆతర్వాత హరీష్ శంకర్ తో మూవీ పూర్తయ్యాకే సురేందర్ రెడ్డి తో పవన్ కల్యాణ్ సినిమా ఉంటుంది. దీంతో ఈలోగా సురేందర్ రెడ్డి – అఖిల్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.