‘నేను ఎంతకాలం బతుకుతానో తెలీదు.. ఏక్షణమైనా మరణం నన్ను పలకరించొచ్చు’.. ఆవేశం, ఆవేదన మేళవించిన గొంతుతో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్న మాటలివి. కరీంనగర్‌లో జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాటలకు సభకు విచ్చేసిన పార్టీ కార్యకర్తల్లో ఒకింత ఆందోళన మొదలైంది.
కొత్త పురపాలక చట్టం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కూడా అక్బరుద్దీన్ పాల్గొన్నారు. బిల్లుపై తన అభిప్రాయాన్ని నిక్కచ్ఛిగా చెప్పిన ఆయన.. ప్రభుత్వానికి సూచనలిచ్చారు. కానీ.. ఇంతలోనే ఆయన ఈ బహిరంగ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. పార్టీ కార్యకర్తల్లో ఆందోళనను పెంచుతోంది. ‘తాను ఏక్షణంలోనైనా చనిపోవచ్చని’.. డాక్టర్లు చెప్పిన విషయాన్ని అక్బర్ బహిరంగ సభలో ప్రస్తావించారు.
అయితే.. మరణం విషయంలో బాధలేదు.. కానీ.. తనకున్న బాధంతా ఒక్కటే.. కరీంనగర్‌లో బీజేపీ బలపడటం.. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం తనకు చాలా బాధగా ఉందన్నారు అక్బర్. భవిష్యత్తులో కూడా ఎంఐఎంకి ఓటేయ్యకపోయినా ఫర్వాలేదు. కానీ.. బీజేపీకి ఓటేసి గెలిపించొద్దని కోరారు అక్బరుద్దీన్ ఓవైసీ.