అడవిదున్న దాడి… గాల్లోకి ఎగిరిన చిన్నారి
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వన్యమృగ సంరక్షణ కేంద్రానికి సరదాగా వెళ్లిన ఒక చిన్న కుటుంబానికి ఊహించని అనుభవం ఎదురైంది. అక్కడి యెల్లోస్టోన్ ప్రాంతంలో ఈ ఫ్యామిలీ తిరుగుతుండగా,, ఎక్కడినుంచి వచ్చిందో హఠాత్తుగా వచ్చిన అడవిదున్న వారిపై దాడికి దిగింది. ఈ ఘటనలో పెద్దవాళ్ళిద్దరూ భయంతో పరుగులు తీసి పారిపోయారు. వారితో బాటు పరుగు పెట్టిన చిన్నారి వెంటబడిన ఈ అడవిదున్న అమాంతం ఆమెను కాలితో కుమ్మివేసింది. ఈ సంఘటనలో కొన్ని అడుగుల ఎత్తున గాల్లోకి ఎగిరి పడి […]
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వన్యమృగ సంరక్షణ కేంద్రానికి సరదాగా వెళ్లిన ఒక చిన్న కుటుంబానికి ఊహించని అనుభవం ఎదురైంది. అక్కడి యెల్లోస్టోన్ ప్రాంతంలో ఈ ఫ్యామిలీ తిరుగుతుండగా,, ఎక్కడినుంచి వచ్చిందో హఠాత్తుగా వచ్చిన అడవిదున్న వారిపై దాడికి దిగింది. ఈ ఘటనలో పెద్దవాళ్ళిద్దరూ భయంతో పరుగులు తీసి పారిపోయారు. వారితో బాటు పరుగు పెట్టిన చిన్నారి వెంటబడిన ఈ అడవిదున్న అమాంతం ఆమెను కాలితో కుమ్మివేసింది. ఈ సంఘటనలో కొన్ని అడుగుల ఎత్తున గాల్లోకి ఎగిరి పడి ఆమె గాయపడింది. ఆ బాలిక కిందపడిపోగానే భారీ దున్న వెనుదిరిగింది. గాయపడిన చిన్నారిని ఆమె పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. తక్షణ చికిత్స లభించడంతో ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఆ కుటుంబం మళ్ళీ ఆ వన్యమృగ సంరక్షణ కేంద్రం పేరెత్తితే ఒట్టు..