ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం

దేశ రాజధానిలో శుక్రవారం ఉదయం కాలుష్యం పెరగడంతో గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) గణాంకాల ప్రకారం ఆనంద్ విహార్లో 387..

ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం
Follow us

|

Updated on: Oct 23, 2020 | 6:47 PM

దేశ రాజధానిలో శుక్రవారం ఉదయం కాలుష్యం పెరగడంతో గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) గణాంకాల ప్రకారం ఆనంద్ విహార్లో 387, ఆర్కె పురంలో 333, రోహిణిలో 391, ద్వారకలో 390 పాయింట్లతో నాలుగు ప్రాంతాలు చాలా దారుణమైన  స్థితిలో ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ)‌లో నమోదైంది.  కాలుష్యానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు, నిర్మాణ సంస్థలు, మునిసిపల్ సంస్థలు, ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖతో పాటు పలు సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సిపిసిబి) ఢిల్లీ హైకోర్టులో నివేదిక సమర్పించింది. 

కాగా కాలుష్యాన్ని కంట్రోల్ చెయ్యడానికి తమ ప్రభుత్వం ‘రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్’ ప్రచారాన్ని ప్రారంభించిందని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఎర్ర ట్రాఫిక్ లైట్ల వద్ద కార్లు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల వాహన కాలుష్యాన్ని 15-20 శాతం తగ్గించవచ్చని ఆయన తెలిపారు. అంతర్గత కాలుష్య వనరులను అరికట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇతర కాలుష్య నివారణ మార్గాలను అన్వేశించడానికి కేంద్రం  పొరుగు రాష్ట్రాలను సహాయం  అభ్యర్థిస్తున్నామని మంత్రి తెలిపారు.  

Also Read :

కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

హెడ్‌మాస్టార్ దారితప్పాడు..సర్టిఫికేట్ కోసం లంచం