యూఏఈ టూ ఇండియా : డిసెంబర్ 31 వరకు టికెట్ బుకింగ్స్

 యూఏఈ నుంచి ఇండియాకు వచ్చే విమానాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆదివారం ప్రకటించింది.

యూఏఈ టూ ఇండియా : డిసెంబర్ 31 వరకు టికెట్ బుకింగ్స్
Follow us

|

Updated on: Oct 19, 2020 | 6:57 PM

యూఏఈ నుంచి ఇండియాకు వచ్చే విమానాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆదివారం ప్రకటించింది. కోవిడ్ లాక్‌డౌన్ వల్ల ఇతర దేశాలలో చిక్కుకుపోయిన ఇండియన్స్‌ను  స్వదేశానికి తరలించడానికి కేంద్ర చేపట్టిన ‘వందే భారత్ మిషన్’ ఏడో దశలో భాగంగా యూఏఈ నుంచి భారత్‌కు వచ్చే వారి కోసం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు విరించింది. ఈ టికెట్లను ఎయిర్‌లైన్ అఫిషియల్‌ వెబ్‌సైట్ లేదా కాల్‌సెంటర్ ద్వారా గానీ, అధీకృత ట్రావెల్ ఏజెంట్ వద్ద గానీ కొనుగోలు చేయొచ్చని ఎయిర్‌లైన్ తన ట్వీట్‌లో పేర్కొంది.

యూఏఈ నుంచి స్వదేశానికి రావాలనుకునే ప్రవాస భారతీయుల కోసం అక్టోబర్ 1 నుంచి 25 వరకు ఎయిరిండియా  270 రిపాట్రియేషన్ విమానాలు నడపనుంది. అలాగే ఇండియాలోని వివిధ నగరాల నుంచి యూఏఈకి 269 విమానాలు వెళ్లనున్నాయి. కాగా, కొన్ని గల్ఫ్ దేశాల్లో ఇండియా నుంచి వెళ్లే ఇన్‌బౌండ్ విమానాలపై బ్యాన్ విధించిన కారణంగా, ఆ దేశాలకు చెందిన వేలాది మంది ప్రవాస కార్మికులు ఇప్పుడు యూఏఈ ద్వారా ప్రయాణించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా టికెట్ల బుకింగ్స్‌ గడువును పెంచింది.

Also Read 

కొండెక్కిన కూరగాయల ధరలు

పైసాకే బిర్యానీ..ఎగబడ్డ జనం