కడుపు అతుక్కొని పుట్టిన అవిభక్త కవలలు..లక్షల మందిలో ఒకరికి ఇలా..!

కవల పిల్లలు పుట్టడం అనేది అనేక సందర్భాల్లో చూస్తుంటాం. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అవిభక్త కవలలు జన్మించారు..అయితే...

కడుపు అతుక్కొని పుట్టిన అవిభక్త కవలలు..లక్షల మందిలో ఒకరికి ఇలా..!
Jyothi Gadda

|

Oct 19, 2020 | 6:50 PM

కవల పిల్లలు పుట్టడం అనేది అనేక సందర్భాల్లో చూస్తుంటాం. చాలా మంది కవల పిల్లలు పుడుతుంటారు. ఆ ఇద్దరు ఒకే పోలికను కలిగి ఉండి, తల్లిదండ్రులతో పాటు, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో కొంతమంది కవల పిల్లలు పలు అనారోగ్య సమస్యలతో పుడుతుంటారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అవిభక్త కవలలు జన్మించారు..అయితే… జన్మించిన కొన్ని గంటల వ్యవధిలోనే.. ఈ ఇద్దరూ శిశువులు మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోం ఆసుపత్రిలో మండల కేంద్రానికి చెందిన చెవుల శిరీష-వెంకటేష్ దంపతులకు మూడవ కాన్పులో ఆడ – మగ శిశువులు అవిభక్త కవలలుగా జన్మించారు. పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేరిన శిరీషకు వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయగా అవిభక్త కవలలు జన్మించారు. ఇద్దరికీ కడుపు భాగం అతుక్కుని ఉంది. కాళ్లు, చేతులు, తలలు వేర్వేరుగా ఉన్నాయి.

ఈ సందర్బముగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ…. ప్రతి లక్ష మందిలో ఒకరికి ఇలా జన్మిస్తారని, వీరిని అవిభక్త కవలలు అంటారని తెలిపారు. ఇది ముఖ్యముగా ఆంటిరో వైరస్ రేతిరోకు చెందుతుందని, దీనిద్వారా పేగులు, బొడ్డు కలుపుకొని పుడుతారని వైద్యులు పేర్కొన్నారు. వీరిని ఆపరేషన్ చేసి బయటకు తీశామని, ఇటువంటివి చాలా అరుదైన కేసులు అని చెప్పారు. కష్టముతో కూడుకున్నవి ఐనా కూడా చాలా కష్టపడి విజయం సాధించామని తెలియజేశారు. ముఖ్యంగా మూడవ కాన్పు, నాలుగవ కాన్పు లేదా ఐదవ కాన్పుకు సంబందించి ఎక్కువ మందిలో అరుదుగా ఇలా జన్మించడం జరుగుతుందని, అందువల్ల రెండవ కాన్పుఅయిన తరువాత కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకోవడం వలన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని వైద్యులు వెల్లడించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu