కర్నాటక డిప్యూటీ సీఎం కుమారునికి కరోనా, హైదరాబాద్ తరలింపు
కర్నాటక డిప్యూటీ సీఎం గోవింద్ కార్జోల్ కుమారుడు గోపాల్ కార్జోల్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకడంతో ఆయనను విమానంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి తరలించారు. సుమారు 24 రోజులుగా గోపాల్ వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్నాడని గోవింద్ కార్జోల్ తెలిపారు. తమ కుటుంబంలో 8 మందికి ఈ వైరస్ సోకిందని, తాను, తన భార్య పూర్తిగా కోలుకున్నామని ఆయన వెల్లడించారు. కర్నాటక లో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలువురు మంత్రులు కోవిడ్ బారిన […]

కర్నాటక డిప్యూటీ సీఎం గోవింద్ కార్జోల్ కుమారుడు గోపాల్ కార్జోల్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకడంతో ఆయనను విమానంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి తరలించారు. సుమారు 24 రోజులుగా గోపాల్ వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్నాడని గోవింద్ కార్జోల్ తెలిపారు. తమ కుటుంబంలో 8 మందికి ఈ వైరస్ సోకిందని, తాను, తన భార్య పూర్తిగా కోలుకున్నామని ఆయన వెల్లడించారు. కర్నాటక లో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలువురు మంత్రులు కోవిడ్ బారిన పడ్డారు. అటు-బాగల్ కోట్ జిల్లా ముధోల్ నియోజకవర్గానికి గోవింద్ కార్జోల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన కుమారుడికి ఊపిరి తిత్తుల మార్పిడి జరగవచ్చనని ఆయన పేర్కొన్నారు.



