కాంగ్రెస్‌‌లో 140 మంది కీలక నేతల రాజీనామా..

రాజీ లేదు.. రాజీనామాలే. ఏఐసీసీలో ఉన్న కీలక పదవులను త్యాగం చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్లు రాజీనామాలు చేస్తున్నారు. రాహుల్‌తో సీనియర్ల భేటీ తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలు రాజీనామాలపై సంతకాలు చేశారు. ఓటమికి బాధ్యతగా నేనొక్కడినే ఎందుకు.. అందరూ బాధ్యత తీసుకోవాలన్న రాహుల్ డిమాండ్‌కు తలొగ్గిన సీనియర్లు రిజైన్ చేసేస్తున్నారు. వాస్తవానికి రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయొద్దని నచ్చచెప్పడానికి వెళ్లిన నేతలు తమకు తాము రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజీనామా చేసిన జాబితాలో […]

కాంగ్రెస్‌‌లో 140 మంది కీలక నేతల రాజీనామా..
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 8:03 PM

రాజీ లేదు.. రాజీనామాలే. ఏఐసీసీలో ఉన్న కీలక పదవులను త్యాగం చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్లు రాజీనామాలు చేస్తున్నారు. రాహుల్‌తో సీనియర్ల భేటీ తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలు రాజీనామాలపై సంతకాలు చేశారు. ఓటమికి బాధ్యతగా నేనొక్కడినే ఎందుకు.. అందరూ బాధ్యత తీసుకోవాలన్న రాహుల్ డిమాండ్‌కు తలొగ్గిన సీనియర్లు రిజైన్ చేసేస్తున్నారు. వాస్తవానికి రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయొద్దని నచ్చచెప్పడానికి వెళ్లిన నేతలు తమకు తాము రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజీనామా చేసిన జాబితాలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు.

అయితే మొత్తం 140 మందికి పైగా నేతలు ఇప్పటికే రాజీనామాలు చేస్తూ.. రాహుల్ గాంధీకి లేఖలు పంపారు. ఇందులో కొందరు తమకు ఎలాంటి పదవులు వద్దని.. రాహుల్ తన పదవికి రాజీనామా చేస్తూ.. రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన వారిలో పార్టీ న్యాయ విభాగం అలాగే ఆర్టీఐ విభాగానికి బాధ్యత వహిస్తున్న వివేక్ తన్ఖా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈయననే కాకుండా ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాకు చెందిన కొందరు నేతలు కూడా తమ రాజీనామాలను రాహుల్‌కి పంపించారు.

Latest Articles