ఆఫ్ఘన్‌లో కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో నిత్యం ఎక్కడో ఓ చోట బాంబుల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆప్ఘన్‌ సైన్యం, తాలిబన్లకు మధ్య చోటుచేసుకుంటున్న ఈ ఘర్షణల్లో సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా..

  • Updated On - 1:38 pm, Fri, 31 July 20 Edited By:
ఆఫ్ఘన్‌లో కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో నిత్యం ఎక్కడో ఓ చోట బాంబుల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆప్ఘన్‌ సైన్యం, తాలిబన్లకు మధ్య చోటుచేసుకుంటున్న ఈ ఘర్షణల్లో సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గురువారం నాడు ఆఫ్ఘనిస్థాన్‌లోని లోగర్‌ ప్రావిన్స్‌ రాజధాని పుల్-ఈ-అలాం నగరంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్‌ అధికారులు తెలిపారు. అయితే ఈ కారు బాంబు పేలుడుకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదని ఆఫ్ఘన్‌ అధికారులు తెలిపారు. అయితే ఇది తాలిబన్‌ ఉగ్రవాదుల పనేనంటూ అనుమానిస్తున్నారు.

కాగా, గత కొద్ది రోజులుగా ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా పోలీస్ ఔట్ పోస్టులపై తాలిబన్లు మెరుపు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో తాలిబన్ ఉగ్రవాదులపై రాకెట్ లాంచర్లతో ఆఫ్ఘన్ సైన్యం విరుచుకుపడుతోంది. గత నెల వ్యవధిలో దాదాపు వంద మందికి పైగా తాలిబన్ ఉగ్రవాదుల్ని ఆఫ్ఘన్ సైన్యం హతమార్చింది.

Read More 

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు

కల్తీ మద్యం కాటుకు నలుగురు మృతి