బుట్టబొమ్మ పూజాహెగ్డే కెరీర్లో మరో భారీ మూవీ.. అంతే రేంజ్ లో రెమ్యూనరేషన్.!

బుట్టబొమ్మ పూజాహెగ్డే కెరీర్లో మరో భారీ మూవీ సినిమా పడింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రాబోయే మూవీలో నటించబోతున్నారు పూజాహెగ్డే. హను రాఘవపూడి..

బుట్టబొమ్మ పూజాహెగ్డే కెరీర్లో మరో భారీ మూవీ.. అంతే రేంజ్ లో రెమ్యూనరేషన్.!
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 03, 2020 | 4:57 AM

బుట్టబొమ్మ పూజాహెగ్డే కెరీర్లో మరో భారీ మూవీ సినిమా పడింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రాబోయే మూవీలో నటించబోతున్నారు పూజాహెగ్డే. హను రాఘవపూడి దీన్ని డైరెక్ట్ చేస్తారు. వార్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా నడుస్తుంది. 2018లో పడిపడి లేచే మనసు తర్వాత మళ్లీ సినిమా చేయలేదు హను రాఘవపూడి. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో నిర్మాతలతో పాటు హీరోలు కూడా హను వైపు చూడట్లేదు. అయితే, ఇప్పుడు మలయాళ స్టార్ హీరో, మహానటి సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెన్సేషనల్ హీరో దుల్కర్ సల్మాన్‌తో తాజాగా రంగంలోకి దిగుతున్నాడు హను. భారీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో సైనికుడిగా నటిస్తున్నాడు దుల్కర్. ఈ మూవీకి పూజాహెగ్డే రెండున్నర కోట్లు తీసుకుంటుందని టాక్.