వైఎస్ జగన్ గెలుపుపై ప్రకాష్‌రాజ్ ఏమన్నారంటే..?

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సినీ నటుడు ప్రకాష్‌ రాజ్ ఏపీలో నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన పార్టీనే ఎన్నుకున్నారని.. వైఎస్ఆర్ పార్టీ గెలుపొందడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. గతంలో తనకు, చాలామందికి  జగన్ పై ఉన్న అనుమానాలన్నీ  తొలిగిపోయినట్లు తెలిపారు. తనకు లభించినది పవర్ కాదు, బాధ్యత అనుకుని జగన్ […]

వైఎస్ జగన్ గెలుపుపై ప్రకాష్‌రాజ్ ఏమన్నారంటే..?

Edited By:

Updated on: May 28, 2019 | 8:46 PM

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సినీ నటుడు ప్రకాష్‌ రాజ్ ఏపీలో నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన పార్టీనే ఎన్నుకున్నారని.. వైఎస్ఆర్ పార్టీ గెలుపొందడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. గతంలో తనకు, చాలామందికి  జగన్ పై ఉన్న అనుమానాలన్నీ  తొలిగిపోయినట్లు తెలిపారు. తనకు లభించినది పవర్ కాదు, బాధ్యత అనుకుని జగన్ ఏపీ ప్రజలకు న్యాయం చేస్తాడని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డాడు. దీనితో పాటు ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రకాష్ రాజ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..