Viral Video: నాగు పాముతో గేమ్స్ ఆడాడు.. పాము ఎలా రియాక్ట్ అయ్యిందో చూస్తే షాక్ అవుతారు.?
Viral Video: సాధారణంగా మనకు మనకు పాము కనిపిస్తే ఏం చేస్తాం.. తుర్రుమని అక్కడి నుంచి పారిపోతాం. ఆరు అడుగుల దూరంలో ఉన్నా సరే అక్కడి నుంచి క్షణంలో అదృశ్యమవుతాం. అయితే కొందరు మాత్రం..

Viral Video: సాధారణంగా మనకు మనకు పాము కనిపిస్తే ఏం చేస్తాం.. తుర్రుమని అక్కడి నుంచి పారిపోతాం. ఆరు అడుగుల దూరంలో ఉన్నా సరే అక్కడి నుంచి క్షణంలో అదృశ్యమవుతాం. అయితే కొందరు మాత్రం పాములతో స్నేహం చేస్తారు. విష సర్పం అని తెలిసినా వాటిని మచ్చిక చేసుకుంటారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియోనే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఓ చిన్న బాక్సు నుంచి నాగుపాము బయటకు వచ్చి తల అటుఇటూ ఊపుతోంది. ఈ సమయంలో ఓ వ్యక్తి తన చేయిని ఆ పాము ముందు ఉంచాడు. అయితే సాధారణంగా నాగుపాము ఇలా చేస్తే ఏం చేస్తుంది. వెంటనే బుస్సుమని కాటు వేసింది. సహజంగా జరిగేది ఇదే.
అయితే ఈ వీడియోలోని పాము మాత్రం నిమ్మకుండా ఉండిపోయింది. ఆ వ్యక్తిని అలాగే చూస్తుండి పోయింది. దీనంతటిని అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. పామును మలే మచ్చిక చేసుకున్నాడే అని కొందరు.. ఇంతకీ ఆ వ్యక్తిపై పాము ఎందుకు దాడి చేయలేదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియో మాత్రం అసంపూర్తిగా ఉంది. చివరికి ఆ పాము ఏం చేసిందన్నది మాత్రం లేదు. మరి సదరు వ్యక్తి ఆ పాము పెంచుకుంటున్నాడా.? లేదా దాని కోరలు తీసేశారా? అన్నది మాత్రం తెలియలేదు. ఏదిఏమైనా ఆ వ్యక్తి ధైర్యానికి మాత్రం నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
CDAC Recruitment: సీడ్యాక్‌లో టెక్నికల్ స్టాఫ్ పోస్టులు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..