గొప్ప నిర్ణయం..తెలంగాణలో ఏర్పాటైన ప్లాస్మా డోనార్స్ అసోషియేషన్
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. ఈ క్రమంలో కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న బాధితులను రక్షించేందుకు కోవిడ్-19 విజేతలు సిద్దమయ్యారు.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. ఈ క్రమంలో కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న బాధితులను రక్షించేందుకు కోవిడ్-19 విజేతలు సిద్దమయ్యారు. తాజాగా తెలంగాణలో ప్లాస్మా డోనార్స్ అసోషియేషన్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి నేడు లోగో కూడా ఆవిష్కరించారు. కోవిడ్ నుండి బయటపడినవాళ్ళు ఇతరుల ప్రాణాలు కాపాడటానికి ప్లాస్మా దానం చేయాలని అసోషియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్లాస్మా తెరఫీకి సంబంధించి ఒక అధికారిని కేటాయించడంతో పాటు, ప్లాస్మా దాతలకు విది విధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కాగా తెలంగాణ ప్లాస్మా డోనార్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గూడూరు నారాయణ రెడ్డి వ్యవహరించనున్నారు.




