అధికారుల నిర్లక్ష్యంతో.. రోడ్డుపైనే కరోనా బాధితుడి మృతి..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే అధికారులకు

  • Tv9 Telugu
  • Publish Date - 4:45 am, Sat, 4 July 20
అధికారుల నిర్లక్ష్యంతో.. రోడ్డుపైనే కరోనా బాధితుడి మృతి..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు బాధితుడు. విషయం తెలిసిన వెంటనే ఆంబులెన్స్‌ పంపించాల్సిన అధికారులు దీనిని ఏ మాత్రం పట్టించుకోలేదు.

కాగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూనే ఆంబులెన్స్ కోసం ఎదురుచూశాడా బాధితుడు. 4 గంటల పాటు నడిరోడ్డుపైనే మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయాడు. ఆంబులెన్స్ అందకపోవడంతో కరోనా బాధితుడు మరణించాడనే విషయం తెలుసుకున్న అధికారులు దిద్దుబాటు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటనపై బృహత్ బెంగళూరు మహానగర పాలికే కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఘటనపై విచారణకు ఆదేశించానని, దీనికి కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చారు.

[svt-event date=”04/07/2020,1:39AM” class=”svt-cd-green” ]

[/svt-event]