వర్మకు ఏమైంది ? ఎందుకిలా మారాడు ?

రామ్ గోపాల్ వర్మకు ఏమయ్యింది? మైండ్ పనిచేయక ఇలాంటి పనులు చేస్తున్నాడా? క్రియేటివిటీ తగ్గిపోయి కాంట్రవర్సీలను నమ్ముకున్నాడా? సినిమాలంటే బూతులు చూపించే సాధనాల్లా వాడుతున్నాడా? అసలు వర్మ సినిమాలను సెన్సార్ చేయకుండా బోర్డ్ కూడా  చూసీ చూడనట్టు వదిలేస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు సగటు ఆర్జీవి అభిమానిని వేధిస్తున్నాయి.. శివ, రంగీలా, కంపెనీ లాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ ని డైరెక్ట్ చేసి ట్రెండ్ సెట్ చేసిన వర్మ.. ఇలా మరొకరిని కించపరుస్తూ, వారి పరువుని తీస్తూ […]

వర్మకు ఏమైంది ? ఎందుకిలా మారాడు ?
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 28, 2019 | 2:11 PM

రామ్ గోపాల్ వర్మకు ఏమయ్యింది? మైండ్ పనిచేయక ఇలాంటి పనులు చేస్తున్నాడా? క్రియేటివిటీ తగ్గిపోయి కాంట్రవర్సీలను నమ్ముకున్నాడా? సినిమాలంటే బూతులు చూపించే సాధనాల్లా వాడుతున్నాడా? అసలు వర్మ సినిమాలను సెన్సార్ చేయకుండా బోర్డ్ కూడా  చూసీ చూడనట్టు వదిలేస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు సగటు ఆర్జీవి అభిమానిని వేధిస్తున్నాయి.. శివ, రంగీలా, కంపెనీ లాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ ని డైరెక్ట్ చేసి ట్రెండ్ సెట్ చేసిన వర్మ.. ఇలా మరొకరిని కించపరుస్తూ, వారి పరువుని తీస్తూ సినిమాలను ఎందుకు తీస్తున్నట్టు.

కొందరు వర్మలో క్రియేటివిటీ తగ్గిపోయి ఈ బాట పట్టాడంటారు..ఇంకొందరు సినిమాలు తీయడానికి ఇదే ఈజీ వే అనుకొని ఇలాంటి పనులు చేస్తున్నాడేమో అంటూ డౌట్ పడుతున్నారు. ఎంతసేపూ ఒక వర్గం వాళ్లని టార్గెట్ చేయడం, వివాదాస్పద పాత్రలను ఇంట్రడ్యూస్ చేయడంలోనే వర్మ కాలం వెళ్ళదీస్తున్నాడంటూ ఫైర్ అవుతున్నారు. నిజంగానే వర్మ తన మార్క్ క్రియేటివిటీని ఎందుకు వదిలేసినట్టో..

ఇక పొగ, మందు తాగినట్టు యాక్ట్ చేస్తుంటేనే , ఇట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని టెక్స్ట్ వేయకపోతే ఒప్పుకోని సెన్సార్ బోర్డు..వర్మ, ఇంత రచ్చ చేస్తూ సినిమాలు తీస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది. వర్మకు, సెన్సార్ బోర్డుకు మధ్య ఏదైనా సీక్రెట్ ఒప్పందం ఉందా? అనేది ఇంకొందరి అనుమానం. జీఎస్టీ సినిమాతో ఫుల్ లెంగ్త్ పోర్న్ ని దించేసిన వర్మ, ఇప్పుడు గర్ల్ డ్రాగన్ షినిమాలో కూడా సెమీపోర్న్ చూపించబోతున్నాడా ? అని కూడా డౌట్ క్రియేట్ చేస్తున్నాడు.

మనుషులని దెప్పిపొడిచే సినిమాలు తీయడం , లేదా సెక్సువల్ కంటెంట్ తో సెమీ పోర్న్ మూవీస్ తీయడం.. వర్మకి ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ తప్పా మరోటి కనిపించడం లేదేమో. సినిమా కాన్సెప్ట్ ల మాట అటుంచితే, తీసిన సినిమాలను మార్కెట్ చేసుకోవడంలో వర్మను మించినవారు లేరంటూ కూడా సెటైర్లు వేసుకుంటున్నారు. తీసిన ఏ చిన్న సినిమాకైనా వర్మ కొండంత పబ్లిసిటీ చేసుకోవడానికి అలవాటు పడ్డాడు.. అది కూడా లేని పోని కాంట్రవర్సీలు క్రియేట్ చేసి, ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడంలో దిట్టగా మారాడని, మొత్తానికి ఈ కాంట్రవర్సీలపైన, సెమీపోర్న్ కథలపైనా పెట్టిన శ్రద్ధలో కాస్త కథల ఎంపికలో, మంచి సినిమాలపై పెడితే పాత వర్మను తిరిగి చూడవచ్చేమో అంటూ అభిమానులు ఆశిస్తున్నారు..