‘76% మంది కాంగ్రెస్ హయాంలో చనిపోయారు’: అమిత్ షా

పౌరసత్వ చట్టం అమలుపై అనుకూల, వ్యతిరేక సమూహాల మధ్య ఢిల్లీలో జరగిన హింసాకాండపై లోక్‌సభ దద్దరిల్లింది. ప్రతిపక్షాలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కాగా.. అధికార పక్షం నుంచి అమిత్ షా బలమైన

'76% మంది కాంగ్రెస్ హయాంలో చనిపోయారు': అమిత్ షా
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2020 | 10:07 PM

పౌరసత్వ చట్టం అమలుపై అనుకూల, వ్యతిరేక సమూహాల మధ్య ఢిల్లీలో జరగిన హింసాకాండపై లోక్‌సభ దద్దరిల్లింది. ప్రతిపక్షాలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కాగా.. అధికార పక్షం నుంచి అమిత్ షా బలమైన కౌంటర్ ఇచ్చారు. ప్రధానంగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో చనిపోయిన వారందరూ భారతీయులేనని, వారిని హిందూ-ముస్లింలుగా తాము చూడడం లేదని అమిత్ షా అన్నారు. ఢిల్లీ అల్లర్లకు బాధ్యతగా అమిత్ షా రాజీనామా చేయాలంటూ సభలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి అమిత్ షా గట్టిగానే బదులిచ్చారు.

అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘అల్లర్ల గురించి ఒక పాత రాజకీయ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో మరణించిన శరణార్థుల్లో 76 శాతం కాంగ్రెస్ హయాంలోనే మరణించారు. అలాంటి కాంగ్రెస్ మమ్మల్ని ప్రశ్నిస్తోంది. మా నైతిక విలువలు లెక్కకడుతోంది’’ అని అమిత్ షా తెలిపారు.

[svt-event date=”11/03/2020,9:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]