MLC Elections : తెలంగాణ రాష్ర్టంలో ఆదివారం జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ శాతం ఎంతన్నది లెక్కతేలింది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 67.26 శాతం పోలింగ్ నమోదు కాగా, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 76.41 శాతం పోలింగ్ నమోదు అయింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పరిధిలో అత్యధికంగా గద్వాల జిల్లాలో, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ నమోదైంది. ఇక, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదు కాగా, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. కాగా, 17, 18 తేదీల్లో విజేతలెవరన్నది తేలపోనుంది.