AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న తప్పుతో రూ.6,000 కోల్పోతున్న రైతులు… అలా జ‌రగ‌కుండా ఉండాలంటే..?

రైతుల‌కు మేలు చేకూర్చ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప‌థ‌కాన్ని అమలు చేస్తోన్న‌సంగ‌తి తెలిసిందే. ఈ చేరిన రైతులకు కేంద్ర ప్ర‌భుత్వం ఏడాదికి రూ.6,000 పెట్టుబ‌డి సాయం అందిస్తోంది.

చిన్న తప్పుతో రూ.6,000 కోల్పోతున్న రైతులు... అలా జ‌రగ‌కుండా ఉండాలంటే..?
Ram Naramaneni
|

Updated on: Jul 16, 2020 | 1:16 PM

Share

రైతుల‌కు మేలు చేకూర్చ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప‌థ‌కాన్ని అమలు చేస్తోన్న‌సంగ‌తి తెలిసిందే. ఈ స్కీమ్ లో చేరిన రైతులకు కేంద్ర ప్ర‌భుత్వం ఏడాదికి రూ.6,000 పెట్టుబ‌డి సాయం అందిస్తోంది. ఈ డబ్బులు రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేస్తూ వ‌స్తుంది. అయితే చిన్న‌, చిన్న పొర‌పాట్ల కార‌ణంగా కొంత‌మంది రైతుల‌కు ఈ స్కీమ్ కింద డ‌బ్బులు అంద‌డం లేదు. అర్హ‌త ఉన్నా కానీ దాదాపు 70 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా ల‌బ్ది పొంద‌లేద‌ని స‌మాచారం. పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ కారణంగా రైతులకు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి.

బ్యాంక్ ఖాతా‌, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లలో పేరు సేమ్ ఉండటం లేదు. చిన్న‌, చిన్న త‌ప్పులు దొర్లుతున్నాయి. దీని వల్ల ఆటోమేటిక్ సిస్టమ్ వీరి అప్లికేషన్స్‌ను ఫైన‌ల్ చేయడం లేదు. అందువల్ల ఈ రైతుల‌కు పీఎం కిసాన్ స్కీమ్ కింద‌‌ ప్రయోజనాలు అంద‌డం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఉంది. రైతులు పీఎం కిసాన్ స్కీమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫార్మర్స్ కార్నర్ అనే ట్యాబ్ పై క్లిక్ చేయాలి. లోప‌ల‌ ఎడిట్ ఆధార్ డీటైల్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ తో పాటు క్యాప్చా కూడా ఎంటర్ చేసి ఓకే చేయాలి. అక్కడ మీ పేరు తప్పుగా చూపిస్తే.. అప్పుడు ఆధార్ కార్డ్‌లో లేదా ఇతర సంబంధిత‌ డాక్యుమెంట్లలో పేరును సరిచేసుకోవాలి.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌