AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3T వ్యూహంతోనే కరోనా కట్టడి.. లేదంటే ముప్పు తప్పదు.!

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు సరిగ్గా టెస్టులు చేయడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై తాజాగా నీతి అయోగ్ చైర్మన్ అమితాబ్ కాంత్‌ స్పందించారు. ‘తగినన్ని కరోనా టెస్టులు చేయకుండా కరోనా కట్టడి అసాధ్యమని.. దీని వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదని ఆయన అన్నారు. 3T( టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌) వ్యూహంతో కరోనాను కట్టడి చేయవచ్చని.. ప్రస్తుతం కర్ణాటక, కేరళ, దక్షిణ […]

3T వ్యూహంతోనే కరోనా కట్టడి.. లేదంటే ముప్పు తప్పదు.!
Ravi Kiran
|

Updated on: Jun 15, 2020 | 4:10 PM

Share

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు సరిగ్గా టెస్టులు చేయడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై తాజాగా నీతి అయోగ్ చైర్మన్ అమితాబ్ కాంత్‌ స్పందించారు. ‘తగినన్ని కరోనా టెస్టులు చేయకుండా కరోనా కట్టడి అసాధ్యమని.. దీని వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదని ఆయన అన్నారు. 3T( టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌) వ్యూహంతో కరోనాను కట్టడి చేయవచ్చని.. ప్రస్తుతం కర్ణాటక, కేరళ, దక్షిణ కొరియా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

3T వ్యూహం అంటే ఏంటి.?

ట్రేసింగ్: విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు నిర్వహించి.. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే.. వారిని కలిసిన వారిని వెంటనే గుర్తిస్తారు.

టెస్టింగ్: ఏదైనా ప్రాంతంలో కరోనా కేసు బయటపడితే.. ఆ ప్రాంతంలో ఇంటింటికీ కరోనా టెస్టులు చేయాలి.

ట్రీట్‌మెంట్‌: కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. దీనితో కరోనా మరణాలను తగ్గించవచ్చు. క్వారంటైన్, చికిత్సకు అవసరమయ్యేలా అదనపు పడకలను కూడా ఏర్పాటు చేసుకోవాలి

3T వ్యూహంతోనే కర్ణాటక ముందుకు..

కర్ణాటక రాష్ట్రం 3T వ్యూహంతోనే ముందుకు వెళ్తోంది. దేశంలో కేసులు పెరుగుతున్నా.. కర్ణాటకలో మాత్రం వైరస్ అదుపులోనే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన మెట్రో నగరాల్లో ఒకటైన బెంగళూరులో తక్కువ కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం అని చెబుతున్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 6824 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. బెంగళూరులో ఇప్పటివరకు 648 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో 464 మంది కోలుకున్నారని అక్కడి అధికారులు వెల్లడించారు. యడ్యూరప్ప సర్కార్ నాలుగో టీగా టెక్నాలజీని ఉపయోగిస్తూ.. కర్ణాటకలో కరోనా కట్టడికి 3టీ వ్యూహాన్ని అమలు చేస్తూ.. వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తోంది.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి