AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు.. IMDBలో ఏకంగా 9.3 రేటింగ్

రెండు వేర్వేరు డెత్ మిస్టరీల నేపథ్యంలో సాగే ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ కు సినిమాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. కలెక్షన్లతో పాటు కంటెంట్ పరంగానూ ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

OTT Movie: ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు.. IMDBలో ఏకంగా 9.3 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 25, 2026 | 5:52 PM

Share

ప్రస్తుతం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ రకం సినిమాలను చూసేవారు చాలా మంది ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీలో కనీసం రెండు, మూడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లేదా సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఇతర భాషల్లోహిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు కూడా ఆయా భాషల డబ్బింగ్ వెర్షన్ తో ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అలా ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తోంది. థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను కూడా మెప్పించేందుకు వస్తోంది. ఆ సినిమా మరేదో కాదు అక్కినేని సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ‘ప్రతి చర్యకూ దానికి సమానమైన, వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది’ అనే న్యూటన్  భౌతిక శాస్త్ర నియమాన్ని మానవ ప్రవర్తనకు, నేర ప్రపంచానికి ముడిపెడుతూ దర్శకుడు రాజేష్ కర్ణ ఈ సినిమాను తెరకెక్కించారు. సుమంత్ తో పాటు జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల తదితరులు ఈమూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా జులై 31న థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రొటీన్ క్రైమ్ కథలకు భిన్నంగా  ‘కర్మ’ కాన్సెప్టును క్రైమ్ థ్రిల్లర్ కు జోడించి సినిమాను మలిచిన విధానం ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన న్యూటన్స్ థర్డ్ లా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 27 నుంచి సుమంత్ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.  త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన రానుంది.  ఈటీవీ విన్ సమర్పణలో తెరకెక్కిన న్యూటన్స్ థర్డ్ లా మూవీలో రవి వర్మ, అవసరాల శ్రీనివాస్, షెల్లీ ఎన్ కుమార్, త్రినాథ్ వర్మ, నేహా పఠాన్, రూపేశ్ మార్రపు, హరిణి రావు, అభినయన, పండిట్ గౌతమ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సింజిత్ యర్రమిల్లి సంగీతం అందించారు.

ఈటీవీ విన్ లో అక్కినేని సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా..

అక్కినేని సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us