
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరులోని పారప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని ఖైదీలకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తమ్మీద కొత్తగా 32 మంది ఖైదీలు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు జైలు అధికారులు తెలిపారు. వీరిలో 31 మంది పురుషులుకాగా, ఒక మహిళ ఉన్నట్లు తెలుస్తోంది.
వీరినందరినీ గడిచిన 20 రోజుల వ్యవధిలోనే అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. ఖైదీల్లో మగవాళ్లను హజ్ భవన్‌కు, మహిళను శ్రీశ్రీ రవిశంకర్ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించారు.
Also Read: యాప్‌ల నిషేధంపై.. చైనాకు ఇండియా ధీటుగా జవాబు