హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి బస్సులో మంటలు.. ముగ్గురు దుర్మరణం
ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సుకు హైటెన్షన్ విద్యుత్ తీగ తగలడంతో... మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు.
ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సుకు హైటెన్షన్ విద్యుత్ తీగ తగలడంతో… మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లాబానా గ్రామ దగ్గర్లో ఒక ట్రక్కు బోల్తా పడటంతో జైపూర్-ఢిల్లీ నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్లడానికి ట్రై చేశాడు ఈ క్రమంలో బస్సుకు హైటెన్షన్ విద్యుత్ లైన్ కు తగలగా మంటలు చెలరేగినట్లు స్థానిక పోలీసు అధికారి అనితా మీనా వెల్లడించారు.
బస్సులోని ఇతర ప్రయాణికులను సేఫ్‌గా ఆస్పత్రికి తరలించినట్లు అనితా మీనా వివరించారు. క్షతగాత్రులను నిమ్స్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది, ప్రయాణీకులు మేల్కోని ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు.
Also Read : శ్రీవారి భక్తులకు శుభవార్త, వర్చువల్ సేవా టికెట్లు విడుదల, రోజుకు ఎన్నో తెలుసా..?