AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Detox: పడుకునే ముందు 1 గంట ఫోన్ పక్కన పెడితే.. మీ హార్మోన్స్‌లో జరిగే ఆ అద్భుతమైన మార్పులివే!

ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్‌ఫోన్ మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి ఒక వ్యసనంగా మారింది. ముఖ్యంగా బెడ్‌పై పడుకున్న తర్వాత కూడా లైట్లన్నీ ఆర్పేసి గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూడటం లేదా చాటింగ్ చేయడం ఈ తరం యువతలో ఎక్కువగా కనిపిస్తోంది.

Digital Detox: పడుకునే ముందు 1 గంట ఫోన్ పక్కన పెడితే.. మీ హార్మోన్స్‌లో జరిగే ఆ అద్భుతమైన మార్పులివే!
Benefits Of No Phone Before Bed
Bhavani
|

Updated on: Jul 06, 2026 | 9:22 PM

Share

రాత్రి పూట మొబైల్ స్క్రీన్ నుండి వచ్చే నీలి రంగు కాంతి మన కళ్లను మాత్రమే కాకుండా శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను పూర్తిగా దెబ్బతీస్తుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు కేవలం ఒక్క వారం రోజుల పాటు.. రాత్రి పడుకోవడానికి సరిగ్గా 1 గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టి నిద్రపోతే, మీ శరీరంలో 3 అద్భుతమైన హార్మోన్ మార్పులు జరుగుతాయి. మీ ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని తిరిగి తెచ్చే ఆ క్రేజీ సైన్స్ నిజాలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

1. మెలటోనిన్ హార్మోన్ ఊరడం – సుఖ నిద్ర

మన మెదడులోని పీనియల్ గ్రంథి రాత్రి కాగానే ‘మెలటోనిన్’ అనే నిద్ర హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మనకు గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది.

కానీ, రాత్రి వేళల్లో ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల.. ఆ నీలి రంగు కాంతిని చూసి మన మెదడు ఇంకా పగలే అనుకుని బ్రమపడుతుంది. దీనివల్ల మెలటోనిన్ ఉత్పత్తి 50% పైగా పడిపోయి నిద్రలేమి సమస్య వస్తుంది.

పడుకునే గంట ముందు ఫోన్ ఆపేస్తే, మెదడు ప్రశాంతపడి మెలటోనిన్ హార్మోన్ విపరీతంగా ఊరుతుంది. ఫలితంగా పడగ్గడిపై వాలగానే క్షణాల్లో గాఢ నిద్ర పడుతుంది.

2. కార్టిసాల్ హార్మోన్ తగ్గడం – ఒత్తిడికి బై-బై

కార్టిసాల్ ను ‘స్ట్రెస్ హార్మోన్’ లేదా ఒత్తిడి హార్మోన్ అని పిలుస్తారు. రాత్రి వేళల్లో ఫోన్‌లో నెగెటివ్ వార్తలు, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు లేదా సోషల్ మీడియాలో ఇతరుల పోస్టులను చూసి మన మనస్సు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతుంది. దీనివల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి.

కార్టిసాల్ పెరిగితే గుండె వేగం పెరగడం, ఉదయం లేవగానే అలసటగా అనిపించడం జరుగుతుంది. ఫోన్‌ను గంట ముందు దూరం పెట్టడం వల్ల మెదడు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లి కార్టిసాల్ స్థాయిలు పడిపోతాయి. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

3. లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్ల సమతుల్యత – బరువు తగ్గడం

మన శరీరంలో ఆకలిని నియంత్రించేవి ‘లెప్టిన్’, ‘గ్రెలిన్’ అనే హార్మోన్లు. రాత్రి పూట నిద్ర సరిగ్గా లేకపోతే ఈ హార్మోన్ల బ్యాలెన్స్ తప్పుతుంది. అందువల్లే రాత్రి 12 గంటల సమయంలో క్రేవింగ్స్ పెరిగి జంక్ ఫుడ్ లేదా స్వీట్లు తినాలనిపిస్తుంది.

ఫోన్ పక్కన పెట్టి టైమ్‌కు పడుకోవడం వల్ల ఈ రెండు హార్మోన్లు పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతాయి. ఫలితంగా అనవసరపు ఆకలి తగ్గి, జీవక్రియ మెరుగవుతుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.

వీటితో పాటు రాత్రి పూట గాఢ నిద్ర పడితే శరీరంలో ‘హ్యూమన్ గ్రోత్ హార్మోన్’ బాగా విడుదలై ముఖంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. అంటే ఎలాంటి కాస్మోటిక్స్ లేకుండానే చర్మం సహజసిద్ధంగా యవ్వనంగా, గ్లోయింగ్‌గా మారుతుంది. రేపటి నుండి ఈ చిన్న డిజిటల్ రూల్‌ను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

గమనిక : ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు అంతర్జాతీయ స్లీప్ రీసెర్చ్ స్టడీస్, వైద్య నిపుణుల నివేదికలు హార్మోన్ల విశ్లేషణల ప్రాతిపదికన అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి. దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు.

Follow Us
పడుకునే ముందు 1 గంట ఫోన్ పక్కన పెడితే మీ బాడీలో జరిగేది ఇదే..
పడుకునే ముందు 1 గంట ఫోన్ పక్కన పెడితే మీ బాడీలో జరిగేది ఇదే..
జూలైలో విడుదలవుతున్న ఈ లేటెస్ట్ కార్ల గురించి తెలుసా
జూలైలో విడుదలవుతున్న ఈ లేటెస్ట్ కార్ల గురించి తెలుసా
సన్న వడ్లకు రూ.500 బోనస్ పథకం.. వారికి మాత్రమే డబ్బులు
సన్న వడ్లకు రూ.500 బోనస్ పథకం.. వారికి మాత్రమే డబ్బులు
వర్షాకాలం పచ్చ కర్పూరం ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
వర్షాకాలం పచ్చ కర్పూరం ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
కారు కొనాలనుకునే వాళ్లకు హోండా గుడ్‌న్యూస్‌.. ఏంటో తెలుసా
కారు కొనాలనుకునే వాళ్లకు హోండా గుడ్‌న్యూస్‌.. ఏంటో తెలుసా
మీ బంగారు నగలు నల్లబడిపోయాయా? ఇంట్లోనే ఇలా చేస్తే తళతళలాడుతాయ్‌
మీ బంగారు నగలు నల్లబడిపోయాయా? ఇంట్లోనే ఇలా చేస్తే తళతళలాడుతాయ్‌
స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..?
స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..?
'ఈశ్వర్'లో ప్రభాస్‌తో నటించిన ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా?
'ఈశ్వర్'లో ప్రభాస్‌తో నటించిన ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా?
మీ బైక్‌కు మోడిఫైడ్ సైలెన్సర్ అమర్చారా..? ఇక నుజ్జు నుజ్జే..
మీ బైక్‌కు మోడిఫైడ్ సైలెన్సర్ అమర్చారా..? ఇక నుజ్జు నుజ్జే..
ప్రోటీన్ ఎక్కువగా తింటే కిడ్నీలు దెబ్బతింటాయా? అసలు నిజం ఇదే!
ప్రోటీన్ ఎక్కువగా తింటే కిడ్నీలు దెబ్బతింటాయా? అసలు నిజం ఇదే!