మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కాఫీ తాగితే ఉపశమనం లభిస్తుందని చాలామంది భావిస్తారు. మైగ్రేన్ సమయంలో మెదడులోని రక్తనాళాలు విస్తకింయి నొప్పి పెరుగుతుంది
TV9 Telugu
కాఫీలో ఉండే కెఫీన్ మెదడులోని అడెనోసిన్ రిసెప్టర్లను నిరోధించి రక్తనాళాలు కుచించుకునేలా చేస్తుంది. అలాంటి సమయంలో కెఫీన్ రక్తనాళాలను మళ్లీ కుచించడంలో సహాయపడుతుంది
TV9 Telugu
అందుకే కొన్ని తలనొప్పి నివారణ మందుల్లో కూడా కెఫీన్‌ను ఉపయోగిస్తారు. అయితే ప్రతి మైగ్రేన్ బాధితుడికి కాఫీ ఒకే విధంగా పనిచేయదు
TV9 Telugu
కొందరిలో కాఫీ తాగిన వెంటనే మైగ్రేన్ దాడి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారు కాఫీని దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
ప్రతిరోజూ ఎక్కువగా కాఫీ తాగే వారు ఒక్కసారిగా కాఫీ తగ్గిస్తే లేదా పూర్తిగా మానేస్తే కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని Caffeine Withdrawal Headache అంటారు
TV9 Telugu
అంటే కాఫీ తాగడం వల్ల కాదు, ఒక్కసారిగా తాగడం ఆపేయడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కాఫీ తాగిన తర్వాత మైగ్రేన్ వస్తే దానిని నివారించడం ఉత్తమం
TV9 Telugu
అయితే కాఫీ తాగని రోజుల్లో మాత్రమే తలనొప్పి వస్తే అది కెఫీన్ ఉపసంహరణ ప్రభావం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కాఫీ మానేయకుండా క్రమంగా తగ్గించడం మంచిది
TV9 Telugu
రోజూ కాఫీ తాగే వారు పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీని సమయానికి తాగడం సాధారణంగా సురక్షితం