ఏపీలో క‌రోనాపై ఇది శుభ‌వార్తే..ఒక్క‌రోజే ఆ జిల్లానుంచి 24 మంది డిశ్చార్జ్

క‌రోనా వైరస్ వీర‌విహారం చేస్తుండ‌టంతో విలవిల్లాడుతున్న కర్నూలు జిల్లా ప్రజలకు శనివారం కాస్త ఊరట క‌లిగించే వార్త అందింది. జిల్లాలో కోవిడ్-19 మహమ్మారి సోకిన మరో 24 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో శనివారం వారిని విశ్వభారతి కోవిడ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం రెండు సార్లు టెస్టుల‌ చేసిన అనంతరం నెగిటివ్ రిజ‌ల్ట్ రావడంతో వారిని శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. డాక్ట‌ర్ల‌ సాయంతో కరోనాపై వారి పోరాటం ఫ‌లించిన‌ట్టే లెక్క‌. […]

ఏపీలో క‌రోనాపై ఇది శుభ‌వార్తే..ఒక్క‌రోజే ఆ జిల్లానుంచి  24 మంది డిశ్చార్జ్
Follow us

|

Updated on: Apr 25, 2020 | 11:17 PM

క‌రోనా వైరస్ వీర‌విహారం చేస్తుండ‌టంతో విలవిల్లాడుతున్న కర్నూలు జిల్లా ప్రజలకు శనివారం కాస్త ఊరట క‌లిగించే వార్త అందింది. జిల్లాలో కోవిడ్-19 మహమ్మారి సోకిన మరో 24 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో శనివారం వారిని విశ్వభారతి కోవిడ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం రెండు సార్లు టెస్టుల‌ చేసిన అనంతరం నెగిటివ్ రిజ‌ల్ట్ రావడంతో వారిని శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. డాక్ట‌ర్ల‌ సాయంతో కరోనాపై వారి పోరాటం ఫ‌లించిన‌ట్టే లెక్క‌. ఒకే రోజు 24 మంది డిశ్చార్జి కావడంతో కర్నూలు జిల్లా ప్ర‌జ‌లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వీరితో క‌లిపి ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో మొత్తం 31 మంది కరోనా నుంచి కోరుకోని క్షేమంగా డిశ్చార్జి అయ్యారు.

కాగా డిశ్చార్జి అయిన 24 మందికి సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేరకు కలెక్టర్‌ వీరపాండియన్‌, స్టేట్‌ కోవిడ్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ అజయ్‌ జైన్‌, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌లు ఒక్కొక్కరికి రూ. 2 వేల నగదు, పండ్ల కిట్లను అందించి స్పెష‌ల్ వెహిక‌ల్స్ లో వారిని ఇళ్ల వ‌ద్ద దించారు.

శనివారం క‌ర్నూలు జిల్లాలో డిశ్చార్జి అయిన వారి వివరాలు:

కర్నూలు నగరం- 7, నంద్యాల- 7, పాణ్యం- 2, సిరవేళ్ల- 2, నందికొట్కూరు- 2, గడివేముల- 1, రుద్రవరం- 1, ఆత్మకూరు- 1, డోన్‌-1.