AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: ప్రాణాలతో చెలగాటం….. 5 నిముషాల్లో ఆక్సిజన్ లేక 22 మంది కోవిద్ రోగుల మృతి….

యూపీలోని ఆగ్రాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి యజమాని చేసిన నిర్వాకమిది..మాక్ డ్రిల్ పేరిట 5 నిముషాల్లో 22 మంది కోవిద్ రోగుల ప్రాణాలు తీశాడట..

Corona Virus: ప్రాణాలతో చెలగాటం..... 5 నిముషాల్లో ఆక్సిజన్ లేక 22 మంది కోవిద్ రోగుల మృతి....
22 Patients Dead
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 08, 2021 | 1:29 PM

Share

యూపీలోని ఆగ్రాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి యజమాని చేసిన నిర్వాకమిది..మాక్ డ్రిల్ పేరిట 5 నిముషాల్లో 22 మంది కోవిద్ రోగుల ప్రాణాలు తీశాడట..(అయితే ఇంతమంది మరణించలేదని,,అసలు ఎంతమంది మృతి చెందారో తెలియదని అంటున్నాడు). రోగులకు ఆక్సిజన్ లేకపోతే ఎంతసేపటిలో..ఎంతమంది మరణిస్తారు…ఎందరు బతుకుతారో తెలుసుకునేందుకు ఇతగాడు “భయంకర’ ప్రయోగమే చేశాడు. చికిత్స పొందుతున్న కోవిద్=నాన్-కోవిద్ వార్డుల్లోని రోగులకు 5 నిముషాల పాటు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేశాడు. అసలే ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న తరుణంలో ఇలా ఓ ప్రయోగం చేసి చూద్దామనుకున్నాడట.. మా హాస్పిటల్ లో ఆక్సిజన్ లేదని చెబుతున్నా రోగుల తాలూకు బంధువులు డిశ్చార్జ్ చేయవద్దంటూ ప్రాధేయపడడంతో ఈ ప్రయోగానికి పూనుకొన్నామన్నాడు. ఏప్రిల్ 26 న తాము 5 నిముషాలపాటు ఆక్సిజన్ నిలిపివేయగా 22 మంది రోగుల శరీరాలు నీలి రంగులో మారాయని, శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడ్డారని అరింజయ్ జైన్ అనే ఈ హాస్పిటల్ యజమాని చెప్పాడు. దాంతో ప్రాణవాయువు లేక వీరు మరణించడం ఖాయమని తాము నిర్ధారించుకున్నామన్నాడు.మిగిలిన కొంతమంది రోగుల బంధువులను మీ ఆక్సిజన్ మీరే తెచ్చుకోవాలని సూచించామన్నాడు. ఇతగాడు చెప్పిన మాటల తాలూకు వీడియో ఆ మధ్య రిలీజయింది. ఈ మాక్ డ్రిల్ లో నలుగురు రోగులు ఏప్రిల్ 26న, ముగ్గురు 27 న మృతి చెందారని చెప్పాడు..మరి 22 మంది మరణించినట్టు వార్తలు వచ్చాయనగా ఎంతమంది మృతి చెందిందీ తనకు తెలియదన్నారు.

అయితే ఈ వీడియోలో ఉన్నది తానేనని అంగీకరించినప్పటికీ.. తన చెప్పినదానిని మరో రకంగా అన్వయించుకున్నారని జైన్ చెప్పాడు. ఈ హాస్పిటల్ లో రోగుల మృతి.. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆగ్రా వైద్య అధికారి ఓ కమిటీని నియమించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Strange Snake fact check: కరీంనగర్‌లో అరుస్తున్న పాము.. వైరల్ వీడియోలో అసలు మలుపు..!

ఓ ఇంజనీర్ లీలలు.. పెళ్లి పేరిట 12 మంది యువతులపై లైంగిక వేధింపులు.. ఆ తర్వాత ఏమైందంటే.?

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి