West Bengal Politics Heat : ఎన్నికలు సమీపిస్తున్నవేళ బెంగాల్ లో పొలిటికల్ హీట్, టీఎంసీ ఆఫీస్ పై దాడి, ఇద్దరు మృతి
పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా దినాజ్‌పూర్ నగరంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై...
West Bengal Politics Heat :పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా దినాజ్‌పూర్ నగరంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు. ఈ హత్య ఘటనకు సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని సౌత్ దినాజ్ పూర్ ఎస్పీ దేబర్షి దత్తా చెప్పారు.
మరోవైపు ఫుర్బా బర్ధమాన్ జిల్లాలో అధికార టిఎంసి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీ తృణమూల్ బీజేపీ కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.
Also Read: తీవ్ర దుమారం రేపుతున్న ఏపీ డీజీపీ వ్యాఖ్యలు.. బీజేపీ కార్యాచరణపై ఉత్కంఠ..