అర్థరాత్రి సింహాలను వెంబడిస్తూ…!

| Edited By: Srinu

Aug 26, 2019 | 1:15 PM

గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నిషేధిత స్థలంలోకి ప్రవేశించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు జర్నలిస్టులు కాగా..నలుగురు ఇతర వ్యక్తులున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు గిర్ ఫారెస్ట్‌లో సింహాలున్న ప్రాంతంలోకి టార్చ్‌లైట్లతో అక్రమంగా ప్రవేశించారు. సింహాల ముఖాలపై టార్చ్‌లైట్లను వెలిగిస్తూ వాటిని వీడియో తీస్తూ..సింహాలను భయబ్రాంతులకు గురిచేశారు. నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించి సింహాలను వేటాడిన ఆరుగురు వ్యక్తులపై వైల్డ్‌లైఫ్ యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు గిర్ డివిజన్ […]

అర్థరాత్రి సింహాలను వెంబడిస్తూ...!
Follow us on

గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నిషేధిత స్థలంలోకి ప్రవేశించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు జర్నలిస్టులు కాగా..నలుగురు ఇతర వ్యక్తులున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు గిర్ ఫారెస్ట్‌లో సింహాలున్న ప్రాంతంలోకి టార్చ్‌లైట్లతో అక్రమంగా ప్రవేశించారు. సింహాల ముఖాలపై టార్చ్‌లైట్లను వెలిగిస్తూ వాటిని వీడియో తీస్తూ..సింహాలను భయబ్రాంతులకు గురిచేశారు. నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించి సింహాలను వేటాడిన ఆరుగురు వ్యక్తులపై వైల్డ్‌లైఫ్ యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు గిర్ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ధీరజ్ మిట్టల్ తెలిపారు.