AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అలర్ట్: ఇటలీని అధిగమించనున్న భారత్..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. భారత్ లో ఒకే రోజు దాదాపు 9వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

కరోనా అలర్ట్: ఇటలీని అధిగమించనున్న భారత్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2020 | 5:50 PM

Share

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. భారత్ లో ఒకే రోజు దాదాపు 9వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఈ గ్రోత్‌ రేట్‌ ఇలానే కొనసాగితే రెండ్రోజుల్లో ఇటలీని బీట్‌ చేస్తామని వైద్యాధికారులు చెప్తున్నారు.

కాగా.. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 9,851 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 2,26,770కి చేరింది. ఈ కేసుల సంఖ్య ఇలానే పెరిగితే రెండ్రోజుల్లో దాదాపు 2, 34, 919కి చేరుతుందని దీంతో ఇప్పటి వరకు టాప్‌ 6లో ఉన్న ఇటలీని మనం బీట్‌ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఇటలీ కేసుల సంఖ్య 2,34,013. మన దేశంలో మరణాల రేటు ఇటలీ కంటే ఐదు రెట్లు తక్కువగా ఉంది. కరోనా కేసుల్లో యూఎస్‌ ఫస్ట్‌ప్లేస్‌లో ఉండగా.. బ్రెజిల్‌, రష్యా, యూకే, స్పెయిన్‌, ఇటలీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరోవైపు.. భారత్ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. మరణాల పరంగా 12వ ర్యాంక్‌లో ఉండగా.. కోలుకునే కేసులకు సంబంధించి 8వ స్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ 4.0లో ఇచ్చిన మినహాయిపులు భారీ మూల్యాన్నే చెల్లించుకొనేలా చేస్తున్నాయి. ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. తాజాగా గురువారం ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,004 కి చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 650కి చేరుకుంది.

Also Read: అంగన్‌వాడీల్లో ‘నాడు – నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం