ప్రాణభయంతో బీహార్.. ఓ వైపు మెదడువాపు.. మరోవైపు వడదెబ్బ

బీహార్‌లో మెదడువాపు వ్యాధి విజృంభిస్తోంది. ముజఫర్‌పూర్‌లో ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందిన చిన్నారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నిన్నటి వరకు 93 మంది చిన్నారులు మృతి చెందగా, ఆ సంఖ్య నేడు 100కి చేరింది. 16 రోజుల్లోనే 100 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కాగా, ఇంకా 300 మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో 83 మంది, కేజ్రీవాల్‌ ఆస్పత్రిలో […]

ప్రాణభయంతో బీహార్.. ఓ వైపు మెదడువాపు.. మరోవైపు వడదెబ్బ
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2019 | 2:03 PM

బీహార్‌లో మెదడువాపు వ్యాధి విజృంభిస్తోంది. ముజఫర్‌పూర్‌లో ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందిన చిన్నారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నిన్నటి వరకు 93 మంది చిన్నారులు మృతి చెందగా, ఆ సంఖ్య నేడు 100కి చేరింది. 16 రోజుల్లోనే 100 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కాగా, ఇంకా 300 మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో 83 మంది, కేజ్రీవాల్‌ ఆస్పత్రిలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా ఉంటే మరోవైపు వడదెబ్బ కారణంగా 24 గంటల్లో 61 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క ఔరంగాబాద్‌లోనే 30 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోగా.. గయాలో 20 మంది, నవాడా జిల్లాలో 11 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.