క్వాలిఫయర్ 2: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భారీ మార్పులు..
మరికొద్దిసేపట్లో అబుదాబీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ బెంగళూరు మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. లీగ్ స్టేజిలో వరుస విజయాలు..

IPL 2020: మరికొద్దిసేపట్లో అబుదాబీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ బెంగళూరు మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. లీగ్ స్టేజిలో వరుస విజయాలు.. ఎలిమినేటర్‌లో ఆర్‌సీబీపై గెలుపుతో సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంటే.. ఢిల్లీ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి మొదటిసారి ఫైనల్స్‌కి వెళ్లాలని తహతహలాడుతోంది.అయితే ఢిల్లీకి బ్యాటింగ్ వైఫల్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
ఇప్పటిదాకా ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్.. ఢిల్లీకి మంచి ఆరంభాన్ని ఇచ్చింది లేదు. అలాగే పంత్ నుంచి కూడా భారీ ఇన్నింగ్స్ రాలేదు. అటు స్టోయినిస్, హిట్‌మెయిర్ నిలకడలేమి జట్టుకు పెద్ద మైనస్. ఈ తరుణంలో ఢిల్లీ యాజమాన్యం జట్టులో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఓపెనర్ పృథ్వీ షాను తప్పించి.. అతడి స్థానంలో స్టోయినిస్‌ను పంపించాలని చూస్తోందట. అలాగే డానియల్ సామ్స్ ప్లేస్‌లో హిట్‌మెయిర్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంటుందని తెలుస్తోంది. తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు కీలక మార్పులు చేయడానికి సిద్దమైంది.
Also Read:
ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!
జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..
ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ
అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..
మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!
ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం