5

ఫైనల్ చేరేదెవరు.? వార్నర్‌సేనా.! అయ్యర్ జట్టా.!

ఐపీఎల్ ఫైనల్‌కు అడుగు దూరంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ అబుదాబీ వేదికగా జరగనుంది.

ఫైనల్ చేరేదెవరు.? వార్నర్‌సేనా.! అయ్యర్ జట్టా.!
Follow us

|

Updated on: Nov 08, 2020 | 3:23 PM

IPL 2020: ఐపీఎల్ ఫైనల్‌కు అడుగు దూరంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ అబుదాబీ వేదికగా జరగనుంది. లీగ్ దశలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలవడమే కాకుండా.. ఎలిమినేటర్‌లో బెంగళూరును ఓడించి SRH జోరు మీదుంది. టైటిల్ టార్గెట్‌గా ఈ మ్యాచ్‌లో గెలవాలని కసితో ఉంది.

అయితే ఢిల్లీ జట్టు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. సీజన్ మొదట్లో అదరగొట్టిన ఢిల్లీ.. తర్వాత వరుస ఓటములతో తేలిపోయింది. అటు ముంబైతో జరిగిన క్వాలిఫయర్-1లో కూడా ఘోర ఓటమిని చవి చూసింది. అలాగే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఢిల్లీ ఫైనల్‌కు చేరలేదు. గతం ఎలాగున్నా ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఆత్మవిశ్వాసంతో దిగుతోంది ఢిల్లీ జట్టు.

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. వార్నర్ నుంచి మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ చూడాలని అభిమానులు అనుకుంటున్నారు. ఢిల్లీ జట్టుకు టాప్ ఆర్డర్ పెద్ద మైనస్. వారు విఫలం కావడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఆటతీరు ఎలా ఉంటుందో వేచి చూడాలి.! లీగ్ స్టేజిలో కూడా ఢిల్లీ.. హైదరాబాద్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. మరి ఈసారైనా పోటీతత్వం కనబరుస్తుందో.? లేదో.? కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నవంబర్ 10న ముంబైతో ఫైనల్ ఆడుతుంది.

Also Read:

ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ

అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..

మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!

ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!