Personality: మీరు ఎలా పడుకుంటారు.? దానిబట్టి మీరెలాంటి వారో చెప్పొచ్చు..
మనం చేసే ప్రతీ పని మనం ఎలాంటి వాళ్లమో నిర్ణయిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనం చూసే విధానం, తినే విధానంతో పాటు పడుకునే విధానం కూడా మన వ్యక్తిత్వాన్ని చెబుతుందని అంటున్నారు. మరి మనం నిద్రపోయే విధానం ఆధారంగా మన వ్యక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మనం చేసే ప్రతీ పని మనం ఎలాంటి వాళ్లమో నిర్ణయిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనం చూసే విధానం, తినే విధానంతో పాటు పడుకునే విధానం కూడా మన వ్యక్తిత్వాన్ని చెబుతుందని అంటున్నారు. మరి మనం నిద్రపోయే విధానం ఆధారంగా మన వ్యక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఒకవేళ మీరు కాళ్లు చేతులు దగ్గరికి ముడుచుకొని పడుకుంటే మీరు చాలా సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న వారని అర్థం. అలాగే మీరు చాలా సిగ్గుపడతారని చెబుతున్నారు. మీరు దేని గురించి ఆలోంచారు, ఎప్పుడూ సేఫ్ సైడ్‌గా ఉండాలనే భావనతో ఉంటారు. అలాగే సమస్యల నుంచి పారిపోవాలనే ఆలోచనతో ఉంటారు. మానసికంగా బలహీనమైన వ్యక్తులని అర్థం చేసుకోవాలి.
* ఇక ఒకవైపు పడుకొని చేతులు, కాళ్లు నిటారుగా పెట్టే వారు సామాజికి జీవితాన్ని గడుపుతారని అర్థం. వీరు ఇతరులను మోసం చేయరు. అందరినీ సులభంగా నమ్ముతారు. కొన్ని సందర్భాల్లో ఈ అతి నమ్మకమే వారికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది.
* చేతులు ముందుకు చాచి పడుకునే వారు ఓపెన్ మైండెడ్‌గా ఉంటారు. వీరి ఆలోచనలను విస్తృతంగా ఉంటాయి. అలాగే పనులను చాలా నెమ్మదిగా చేస్తారు. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు.
* చేతులు, కాళ్లు నిటారుగా ఉంచి వెనక్కి తిరిగి పడుకునే వారు రిజర్వ్‌గా ఉండటానికి ఇష్టపడతారు. వీరు నలుగురిలో కలవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. తమ గురించి తాము ఎక్కువగా కేర్ తీసుకుంటారు. ఇతరుల కంటే తమకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. అంటే వీరిలో సెల్ఫ్ కేరింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట.
* బోర్లా పడుకునే వారు ఉల్లాసంగా, ఓపెన్ మైండెడ్‌తో ఉంటారని అర్థం. వీరి స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు. రిస్క్ తీసుకోవడానికి అస్సలు వెనుకడుగు వేయరు. ఇతరులు ఏమి చెప్పినా అస్సలు పట్టించుకోరు. తమకు నచ్చిందే చేస్తారు.
* రెండు చేతులను తల వెనుక దిండులా పెట్టుకుని నిద్రించే వారు ఇతరులతో సౌమ్యంగా ఉంటారు. వీరు ఎవరి గురించి చెడుగా ఆలోచించరు.
* ఇక పిల్లోని కౌగిలించుకుని నిద్రించే వ్యక్తులు ప్రేమతో నిండి ఉంటారు. వారు ఇతరులకు ప్రేమను ఇవ్వడానికి, అదే సమయంలో స్వీకరించడానికి ఇష్టపడతారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు మానసిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అందించినవి మాత్రమే.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..