గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు యువకుడి వినూత్న ఆలోచన.. విత్తనాల సేకరణతో సరికొత్త ప్రయోగం..!

విత్తనాల సేకరణకు టీవీ9 చేపట్టిన ఫీడ్ బాల్స్ కార్యక్రమంతోపాటు వనజీవి రామయ్య తనకు స్ఫూర్తి అని సందీప్ కుమార్ చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేందుకు విత్తనాల సేకరణకు శ్రీకారం చుట్టారు సందీప్ కుమార్.

గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు యువకుడి వినూత్న ఆలోచన.. విత్తనాల సేకరణతో సరికొత్త ప్రయోగం..!
Seeds Collection
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 24, 2024 | 2:35 PM

విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది. దీంతో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 46 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలతో జనం ఇబ్బందులు పడ్డారు. చెట్ల పెంపకం ద్వారానే గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించవచ్చని ఓ యువకుడు గమనించాడు. పర్యావరణ పరిరక్షణకు ఆ యువకుడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదువుకోవాల్సిందే.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అవిరెండ్ల సందీప్‌కుమార్‌ స్థానిక మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ సానిటేషన్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. చదువుకోవడం ద్వారానే జీవితంలో ఏదైనా సాధించవచ్చుని తెలుసుకున్న సందీప్ కుమార్, మున్సిపల్ వర్కర్ గా పనిచేస్తూనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పీజీ పూర్తి చేశారు. మొదటి నుంచి సామాజిక స్పృహ కలిగిన సందీప్ కుమార్, అత్యవసర సమయంలో రక్త, అన్నదానాలు, చలి కాలంలో దుప్పట్ల పంపిణీ వంటి కార్యక్రమాలూ చేస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణకు తన వంతుగా ఏదైనా చేయాలని సంకల్పించాడు.

లక్ష విత్తనాలు లక్ష్యంగా..

నానాటికి పెరిగిపోతున్న భూతాపాన్ని చెట్ల పెంపకం ద్వారా తగ్గించేందుకు.. సందీప్ నడుం బిగించాడు. లక్ష విత్తనాల సేకరణే లక్ష్యంగా చేసుకుని కార్యాచరణను రూపొందించుకున్నాడు. దీనికి సందీప్ ఫ్రెండ్స్,. మేము సైతం అంటూ మద్దతు పలికారు. సందీప్ కుమార్ అండ్ టీం సంచులు పట్టుకుని చెట్ల కింద విత్తనాలు ఏరుతున్నారు. నెల రోజుల క్రితం విత్తనాల సేకరణకు చేపట్టిన సందీప్ కుమార్, ఇప్పటి వరకు 35వేలకు పైగా పలు రకాల విత్తనాలను సమకూర్చుకున్నారు. అత్యధికంగా కానుగ, మామిడి, చింత, పొగడ, నేరేడు, కాసియా ఫిస్టులా, వేప, సపోట వంటి విత్తనాలున్నాయి.

ఖాళీ ప్రదేశాల్లో చల్లుతూ..

పర్యావరణ ప్రేమికుడు సందీప్ కుమార్ అతడి బృందం సేకరించిన విత్తనాలను స్నేహితులతో కలిసి వర్షం పడిన చోట ఖాళీ ప్రభుత్వ స్థలాలు, కొండలు, గుట్టలు, రోడ్ల వెంట చల్లుతున్నారు. అవి మొలకెత్తి చెట్లుగా పెరిగితే పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు ఆక్సిజన్‌ పుష్కలంగా అందడంతో పాటు గ్లోబల్ వార్మింగ్ కొంతైనా తగ్గుతుందని భావిస్తున్నారు.

టీవీ9 సీడ్ బాల్స్.. వనజీవి రామయ్య స్ఫూర్తి..

విత్తనాల సేకరణకు టీవీ9 చేపట్టిన సీడ్ బాల్స్ కార్యక్రమంతోపాటు వనజీవి రామయ్య తనకు స్ఫూర్తి అని సందీప్ కుమార్ చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేందుకు విత్తనాల సేకరణను కొందరు అవహేళన చేశారని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఇక నుంచి మొక్కలు నాటడంతో పాటు వివాహాది శుభకార్యాలకు వెళ్లినప్పుడు మొక్కలనే బహుమతులుగా అందించాలని సందీప్ కుమార్ సూచిస్తున్నారు. పచ్చదనం కోసం అందరూ ప్రయత్నిస్తేనే.. కొంతమేరకైనా గ్లోబల్ వార్మింగ్ తగ్గించవచ్చని సందీప్ కుమార్ అంటున్నారు.

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!