Bandar Laddu: వరల్డ్ ఫేమస్ ఏపీ స్వీట్.. బందరు లడ్డు స్పెషాలిటీ ఏంటో తెలుసా..! చదివితే నోరూరాల్సిందే!

సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితమే బందర్ లో లడ్డూ తయారు అయ్యిందని ఇక్కడి నిర్వాహకులు అంటున్నారు. బందర్‌లో అప్పట్లో నివాసం ఉన్న బొందిలి రాంసింగ్ అనే ఆయన లడ్డు తయారు చేసి బందరులో అమ్మకాలు

Bandar Laddu: వరల్డ్ ఫేమస్ ఏపీ స్వీట్.. బందరు లడ్డు స్పెషాలిటీ ఏంటో తెలుసా..! చదివితే నోరూరాల్సిందే!
Follow us
S Haseena

| Edited By: Subhash Goud

Updated on: Nov 19, 2024 | 6:58 PM

మనం ప్రపంచంలో లడ్డూలు ఎన్నో రకాలుగా చూస్తూనే ఉంటాం. తింటూనే ఉంటాం కానీ బందరులో తయారు అయ్యే తొక్కుడు లడ్డూకు మాత్రమే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లిన ప్రపంచ మొత్తం మీద ‘బందరు లడ్డు’ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఇంత ఫెమస్ అయిన బందర్ లడ్డూ గురించి ఒక లుక్కేద్దాం రాండి..

బందరు లడ్డు ఆంధ్రప్రదేశ్‌లోని (బందరు) మచిలీపట్నంకు చెందిన బాగా గుర్తింపు పొందిన ఒక మిఠాయి. ఈ లడ్డూకు ప్రత్యేకమైన రుచితో పాటు, ప్రత్యేక తయారీ విధానం ఉంది. అందుకే బందర్ లడ్డూ ప్రపంచం అంతా గుర్తింపు పొందిందని అంటారు దీని గురించి తెలిసిన వాళ్ళంతా. లడ్డూ తయారీ విధానమే దీనికి ప్రత్యేక గుర్తింపుకు కారణం అయ్యింది. నెయ్యి సరిపడా మోతాదులో వేసి తయారు చేయడం వల్ల ఈ లడ్డు నెమ్మదిగా నోరులో కరిగిపోతుంది. అందుకే బందరు లడ్డు ప్రధాన ప్రత్యేకత లడ్డూ తిన్నంతసేపు రుచి స్పష్టంగా తెలుస్తుంది. ఈ లడ్డూలు రుచితోపాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అందుకే ఈ లడ్డూలను వివాహాలు, పండగలు, శుభకార్యాలలో ప్రసాదంగా ఉపయోగిస్తారు. బందరు లడ్డు రుచి, నాణ్యత కారణంగా ఇది ఆంధ్రప్రదేశ్‌తో పాటు కూడా దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మిఠాయిగా రికార్డుల్లోకి ఎక్కింది.

బందర్ లడ్డూ ఎప్పుడు… ఎక్కడ.. ఎలా తయారు చేశారు?

సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితమే బందర్ లో లడ్డూ తయారు అయ్యిందని ఇక్కడి నిర్వాహకులు అంటున్నారు. బందర్‌లో అప్పట్లో నివాసం ఉన్న బొందిలి రాంసింగ్ అనే ఆయన లడ్డు తయారు చేసి బందరులో అమ్మకాలు చేశారని ఇక్కడ ప్రస్తుతం స్వీట్స్ అమ్మకాలు జరుపుతున్న వారు అంటున్నారు. బొందిలీలు అంటే రాజస్థాన్ నుండి మిఠాయి తయారీ చేసే వాళ్ళని వాళ్ళంతా రాజస్థాన్ నుంచి కృష్ణాజిల్లా బందరుకు వలస వచ్చిన ‘సింగ్’ లుగా తెలుస్తుంది. రాజస్తాన్ నుంచి వచ్చిన బందరులో స్థిరపడిన వారంతా మిఠాయి తయారిదార్లలో పేరొందిన వారు కావడం వారిలో సర్వశ్రీ బొందిలీ రాంసింగ్,నాట్సింగ్, జగన్నాథ్ సింగ్, ఠాగూర్ సింగ్‌లు అప్పట్లో మిఠాయి తయారీదార్లు అని. వీరు అంతా నల్లహల్కా, తొక్కుడు లడ్డూలు బందరు వాసులతో పాటు ప్రపంచానికి రుచి చూపించారు. అనంతరం బందరు మిఠాయి తయారీ దార్లలో స్థానికులు అయిన సర్వశ్రీ చక్కా నారాయణ స్వామి, జింటాన్ మేస్త్రీగా పిలిచే అనుమకొండ రాఘవయ్య, తెలుకల రాఘవయ్య,టార్జాన్ మేస్త్రీ, గౌరా మల్లయ్యలు కూడా వృత్తిపరంగా మిటాయి.

తయారీదారులుగా మారారు. వారి ద్వారా బందరు మిఠాయి పరిశ్రమలలో అడుగు పెట్టిన విడియాల శరభయ్య, మద్దుల దుర్గయ్య, రేపల్లె వెంకటేశ్వర్లు, విడియాల గురునాధం, విడియాల సత్యం, శిర్విశెట్టి కృష్ణారావు, గౌరా మల్లయ్య, గౌరా వెంకటేశ్వరరావు, పెడన శేషయ్య మొదలగు వారు బందర్ లడ్డూ తయారి అమ్మకాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే బందరు తొక్కుడు లడ్డుకు సాటి వేరొక లడ్డూ పోటీలోలేదనే చెప్పాలి. పటికి బెల్లం పలుకులతో పాటు మరికొన్ని పదార్థాలు నాణ్యమైనవి వేసి బందరు లడ్డూ తయారీ చేయటమంటే నాణ్యతకు పెద్దపీట అంటారు. ఇక్కడి తయారీదారులు. 2012, డిసెంబర్ నెలాఖరున తిరుపతిలో జరిగిన ప్రపంచ మహాసభలలో బందరు నుండి బందరు తొక్కుడు లడ్డూ గౌరా మల్లయ్య 2012. డిసెంబర్‌లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడే తయారు చేసి ప్రముఖులకు, ప్రతినిధులు చూపించారు. బందరు తొక్కుడు లడ్డు పేటెంట్ పొందే దిశగానే నాడు అడుగులు పడ్డాయనీ ఇక్కడి లడ్డూ తయారు దారులు అంటారు.

బందర్ లడ్డూ Gi సర్టిఫికేట్.

ఇదిలా ఉంటే బందరు లడ్డుకి 2018లో జియాగ్రాఫికల్ ఇండికేషన్ Gi ట్యాగ్ వచ్చింది. GI ట్యాగ్ అనేది ఒక ప్రాంతానికి చెందిన ప్రత్యేక ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపు. ఇది ఆ ఉత్పత్తి ప్రత్యేకతను, ఆ ప్రాంతానికి చెందిన రుచిని, చరిత్రను, ప్రాధాన్యతను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. బందరు లడ్డూకి GI ట్యాగ్ అనేది ఆ ప్రాంతంలో ఈ ప్రత్యేకంగా తయారుచేయబడే విధానం పదార్థాలు, రుచి ద్వారా లభించింది. బందర్ లడ్డూకు GI ట్యాగ్ లభించడంతో, ఈ లడ్డు ఇతర ప్రాంతాల్లో దేనికీ పోలిక లేని ప్రత్యేకతగా గుర్తింపు పొందింది. లడ్డు వల్ల బందరు ప్రాంతానికి ఆర్థిక ప్రయోజనాలు కూడా వస్తాయి, ఎందుకంటే ఈ ట్యాగ్ కలిగిన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండటంతో ట్యాగ్ పొందిన తర్వాత ఎవరైనా ఈ లడ్డూను బందరు లడ్డు పేరుతో తయారు చేసి అమ్ముకోవాలంటే, జియాగ్రాఫికల్ రూల్స్ ను పాటించాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే